రానున్న బడ్జెట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సీపీపీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్ పార్లమెంటరీ గ్రూప్ సమావేశం జరిగే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
రానున్న బడ్జెట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సీపీపీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం కాంగ్రెస్ పార్లమెంటరీ గ్రూప్ సమావేశం జరిగే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
ఇదిలావుంటే.. న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో ఈరోజు ఉదయం 11:00 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉభయ సభల్లో రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమావేశం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆదివారం జరిగే అఖిలపక్ష సమావేశానికి లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఉపనేత గౌరవ్ గొగోయ్, రాజ్యసభలో ఉపనేత ప్రమోద్ తివారీ కూడా హాజరుకానున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 22న ప్రారంభమవుతాయి. ఆగస్టు 12న సమావేశాలు ముగియనున్నాయి.