Sam Pitroda : కలకలం రేపుతోన్న శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. నష్ట నివారణ చర్యలో కాంగ్రెస్
శ్యామ్ పిట్రోడా(Sam Pitroda) అని ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయన కాంగ్రెస్(Congress) సీనియర్ నేత! ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్. ఆయన అసలు పేరు సత్యనారాయణ పిట్రోడా(Sathyanarayana Pitroda). గుజరాతి విశ్వకర్మ. ఇప్పుడీ పెద్దమనిషి అనవసరంగా నోరుజారి పార్టీని కంపు కంపు చేశారు. అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఆర్ధికసర్వే చేపడతామంటూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించడమే దుమారం రేపుతోంది. ఇలాంటి సమయంలో గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'అమెరికాలో ఉన్నట్టే దేశంలో వారసత్వ పన్ను ఉండాలి. మరణించిన వారి ఆస్తుల్లో మెజారిటీ వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పంపిణీ చేయాలి' అని చెప్పుకొచ్చారు. నిజానికి ఇలాంటి పన్ను అమెరికా అంతటా లేదు.

ఇది ఫెడరల్ టాక్స్ కాదు. కేవలం ఆరు రాష్ట్రాలలో మాత్రమే ఉంది. అయోవా, కెంటుకీ, మేరీలాండ్, నెబ్రాస్కా, న్యూజెర్సీ, పెన్సిల్వేనియాలో మాత్రమే ఉంది. ఇది కూడా ఓ పరిమితి దాటిన తర్వాత ఒక్క శాతం నుంచి పది శాతం వరకు వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరుగా ఉంది. నిజానికి ఇలాంటి పన్ను మన దేశంలో కూడా ఎస్టేట్ డ్యూటీ పేరుతో ఉండింది. 1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. ఇప్పుడు వర్తమానానికి వద్దాం. శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సొత్తును స్వాధీనం చేసుకుంటుందా? అన్న అనుమానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న ప్రధాని మోదీకి మంచి ఎన్నికల అస్త్రాన్ని ఇచ్చారు పిట్రోడా.
మరణించిన వారి ఆస్తులను కూడా కాంగ్రెస్ దోచుకోవాలనుకుంటున్నదంటూ మోదీ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతూ వస్తున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్యామ్ పిట్రోడా ఏమన్నారంటే..‘అమెరికాలో వారసత్వ పన్ను అనేది ఉన్నది. దాని ప్రకారం.. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సంపద ఉందనుకొందాం. ఆ వ్యక్తి మరణిస్తే.. ఆ సొత్తు అంతా వారసులకు వెళ్లదు. సంపదలో 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటుంది. ఇదొక ఆసక్తికరమైన చట్టం. నేటి తరంవారు.. సంపదను సృష్టించి వెళ్లిపోతున్నారు. అది వారి వారసులకు మాత్రమే దక్కుతుంది. వారసత్వ పన్ను అనేది దేశంలో అమల్లోకి తీసుకొస్తే, ఆ సంపదలో సగం వాటా ప్రభుత్వానికి చెందుతుంది.
తద్వారా ప్రజలకు పంచిపెట్టొచ్చు. ఈ విధానం నాకు న్యాయబద్ధంగానే కనిపిస్తున్నది’ అని చెప్పారు. నిజానికి ఇది కాంగ్రెస్ విధానమే కాదు కానీ ప్రధాని మోదీ(Pradhani modi) మాత్రం తెగ ప్రచారం చేస్తున్నారు. పిట్రోడా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన సంపదపై కాంగ్రెస్ పన్ను విధించాలని చూస్తున్నది. మీరు చెమట చిందించి కూడబెట్టిన సొత్తు.. మీ పిల్లలకు లభించదు. వ్యక్తులు బతికి ఉన్నప్పుడే కాదు, చనిపోయినప్పుడు కూడా వారిని దోచుకోవడం కాంగ్రెస్ విధానంలా కనిపిస్తున్నది. పూర్వీకుల ఆస్తిని అనుభవిస్తున్న ఆ వ్యక్తులు భారతీయులు తమ ఆస్తుల్ని పిల్లలకు ఇవ్వడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు’ అని ధ్వజమెత్తారు.
ఇదేదో తేడా కొడుతుందని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు దిగింది. పిట్రోడా వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొస్తున్నది. మరోవైపు తన వ్యాఖ్యలను వక్రీకరించారని పిట్రోడా అంటున్నారు. సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి బీజేపీ ఇలా చేస్తున్నదని ఆయన ఎదురుదాడికి దిగారు. ఇంకో వైపు దేశ ప్రజల సంపదను సర్వే చేసి పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిందంటూ మోదీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక సర్వే అనంతరం తాము చర్యలు తీసుకొంటామని ఎక్కడా చెప్పలేదని, దేశంలో ఎంతమందికి అన్యాయం జరిగిందన్న విషయాన్ని తెలుసుకోవడానికే ఈ సర్వే చేపడతామని మాత్రమే చెప్పామని రాహుల్ అన్నారు.