కర్ణాటక(Karnataka)లోని కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) హయాంలో అంతా బాగా లేదని.. జనవరి తర్వాత సిద్ధరామయ్య(Siddaramaiah)ప్రభుత్వం కొనసాగదని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ ఆర్ పాటిల్(BJP MLA Basanagouda Patil) వ్యాఖ్యానించారు. తమ పార్టీతో 45 మంది టచ్‌లో ఉన్నారని బసనగౌడ తెలిపారు. మేం సీఎం కాబోతున్నప్పుడు ప్రతిపక్ష నేతను ఎందుకు పెట్టుకోవాలని అన్నారు.

బసనగౌడ ఆర్ పాటిల్ యత్నాల్ మాట్లాడుతూ.. 'బీకే హరిప్రసాద్ సీనియారిటీకి తాము (కాంగ్రెస్ ప్రభుత్వం) ప్రాధాన్యత ఇవ్వలేదని.. అందుకే ఆయన బాధపడ్డారన్నారు. సిద్ధరామయ్యపై బీకే హరిప్రసాద్ ఏం మాట్లాడారో ఆయన అంతర్గత విషయం. అయితే ఈ పరిణామాలన్నీ.. జనవరి తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని స్పష్టం చేస్తున్నాయి. 45 మంది మాతో కాంటాక్ట్‌లో ఉన్నారు. మేం ముఖ్యమంత్రి కాబోతున్నప్పుడు ప్రతిపక్ష నేత గురించి ఎందుకు ఆందోళన చెందాలి అన్నారు.
సిద్ధరామయ్య మంత్రివర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత బీకే హరిప్రసాద్(B. K. Hariprasad)కు చోటు దక్కలేదు. దీంతో బీకే హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారని నివేదికలు తెలుపుతున్నాయి. రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభించిన ఆయన.. ఓబీసీ వర్గీయులతో సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో హరిప్రసాద్ బహిరంగంగానే సీఎం సిద్ధరామయ్యపై ప్రకటనలు చేస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం.. సీఎం సిద్ధరామయ్య దీనిపై పార్టీ ఇన్‌ఛార్జ్ రణదీప్ సూర్జేవాలాకు ఫిర్యాదు చేశారని.. చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారని తెలుస్తోంది.
అదే సమయంలో కర్ణాటక కాంగ్రెస్‌లో మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను చేయాలనే డిమాండ్ కూడా ఉంది. ఎస్సీ/ఎస్టీ వర్గం, మైనారిటీ వర్గం, వీరశైవ లింగాయత్ వర్గాలకు చెందిన ఒక్కొక్క నాయకుడిని ఉపముఖ్యమంత్రిగా చేయాలని ఇటీవల కాంగ్రెస్ నేత ఒకరు డిమాండ్ చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంకు అంగీకరించారు. అయితే.. మరెవరినీ డిప్యూటీ సీఎం చేయవద్దని డీకే శివకుమార్ డిమాండ్ చేసినట్లు కూడా వాదనలు ఉన్నాయి. ఇప్పుడు మరో ముగ్గురిని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ కారణంగా.. డీకే శివకుమార్ ఎలా రియాక్ట్ అవుతారనేది తెలియాల్సివుంది.