పార్లమెంట్(Parliament) నూతన భవనం ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్(Congress) ఎంపీలం బహిష్కరిస్తూన్నామని ఏంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ..

MP Uttam Kumar Reddy
పార్లమెంట్(Parliament) నూతన భవనం ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్(Congress) ఎంపీలం బహిష్కరిస్తూన్నామని ఏంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోదీ భారత రాజ్యాంగాన్ని(Constitution) అవమానపరుస్తున్నారని అన్నారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని(President) పిలవకపోడం దారుణమన్నారు. పార్లమెంట్ భవన శంకుస్థాపన సమయంలో ఉన్న దళిత రాష్ట్రపతిని పిలవలేదని గుర్తుచేశారు. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభం సమయంలో ఉన్న గిరిజన రాష్ట్రపతిని పిలవడం లేదని అన్నారు. పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థని మోదీ కించపరుస్తున్నారని విమర్శించారు. మోదీ పార్లమెంట్ కి రావడం అరుదని వ్యాఖ్యానించారు.
