రణ్‌బీర్‌కపూర్‌(Ranbir Kapoor ), రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా(Sandheep Reddy Vanga) రూపొందించిన యానిమల్‌ సినిమా(Animal Movie) బాక్సాఫీస్‌ దగ్గర విపరీతమైన కలెక్షన్లను సాధిస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో హిట్టయ్యింది. ఇప్పటికే ఈ సినిమాలో సందీప్‌ రెడ్డి మేకింగ్‌ స్టయిల్‌పై చాలామంది ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్‌, రామ్‌ గోపాల్‌ వర్మ, రేణుదేశాయ్‌ వంటి వారు కూడా చిత్రాన్ని మెచ్చుకున్నారు.

రణ్‌బీర్‌కపూర్‌(Ranbir Kapoor ), రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా(Sandheep Reddy Vanga) రూపొందించిన యానిమల్‌ సినిమా(Animal Movie) బాక్సాఫీస్‌ దగ్గర విపరీతమైన కలెక్షన్లను సాధిస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో హిట్టయ్యింది. ఇప్పటికే ఈ సినిమాలో సందీప్‌ రెడ్డి మేకింగ్‌ స్టయిల్‌పై చాలామంది ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్‌, రామ్‌ గోపాల్‌ వర్మ, రేణుదేశాయ్‌ వంటి వారు కూడా చిత్రాన్ని మెచ్చుకున్నారు. ఇదే సమయంలో యానిమల్‌ సినిమాను తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నవారు కూడా ఉన్నారు. సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ నడుస్తోంది. సమాజానికి ఈ సినిమా ఏ సందేశం ఇస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తారు. ఈ తరుణంలో ఛత్తీస్‌గఢ్కు చెందిన ఓ మహిళా ఎంపీ యానిమల్‌ సినిమాపై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ రంజీత్‌ రంజన్‌(Congress MP Ranjeet Ranjan) రాజ్యసభలో యానిమల్ సినిమాపై మాట్లాడారు. సమాజానికి పట్టిన జబ్బుగా యానిమల్‌ సినిమాను ఆమె అభివర్ణించారు. యానిమల్ సినిమా చూసి తన కూతురు ఏడ్చిందని, ఆ చిత్రంలో మహిళల పట్ల హింస దారుణంగా ఉందని చెప్పారు. 'సినిమా అనేది సమాజంలో చాలా ప్రభావం చూపించగలదు. మనం సినిమాను చూస్తూనే పెరిగాం. కాబట్టి సినిమా అనేది యువతను ప్రేరేపిస్తుంది. వారిపై సినిమా ప్రభావం కూడా పడుతుంది. నా కూతురు తన స్నేహితులతో కలిసి యానిమల్‌ చిత్రానికి వెళ్లింది. కానీ సినిమా మధ్యలోనే ఏడుస్తూ బయటకు వచ్చేసింది' అని రాజ్యసభలో ఎంపీ రంజీత్ రంజన్ తెలిపారు. యానిమల్ సినిమాలో సిక్కుల యుద్ధ గీతం అయిన అర్జన్ వైలీని దారుణమైన ఓ హింసాత్మక సీన్ కోసం వాడుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. మొగల్స్, బ్రిటీష్‌తో పోరాడిన సిక్కు యోధుల వీరగాధను ప్రపంచానికి తెలిపిన ఈ పాటను ఇలా వాడుకోవడం ఏ మాత్రం సహించలేని విషయం అని రంజీత్‌ రంజన్‌ చెప్పుకొచ్చారు.

Updated On 9 Dec 2023 1:19 AM GMT
Ehatv

Ehatv

Next Story