మోదీ ప్రభుత్వం పంతం నెరవేర్చుకుంది. తృణమూల్(Trunamool) కాంగ్రెస్ ఎంపీ(Congress MP) మహువా మెయిత్రాను(Mahua Maitra) అధికారిక బంగ్లా(Government Bungalow) నుంచి ఖాళీ(Vaccat) చేయించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆదేశాల మేరకు ఆమె శుక్రవారం ఢిల్లీలోని ప్రభుత్వం బంగ్లాను వదిలేసి వెళ్లిపోయారు.
మోదీ ప్రభుత్వం పంతం నెరవేర్చుకుంది. తృణమూల్(Trunamool) కాంగ్రెస్ ఎంపీ(Congress MP) మహువా మెయిత్రాను(Mahua Maitra) అధికారిక బంగ్లా(Government Bungalow) నుంచి ఖాళీ(Vaccat) చేయించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆదేశాల మేరకు ఆమె శుక్రవారం ఢిల్లీలోని ప్రభుత్వం బంగ్లాను వదిలేసి వెళ్లిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్న మహువాకు ఢిల్లీలో ఓ ప్రభుత్వ బంగ్లాను కేటాయించారు. అయితే గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దు అయ్యింది. దీంతో బంగ్లాను ఖాళీ చేయాలంటూ మొయిత్రాకు అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. జనవరి 7వ తేదీ లోగా ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు ఆమెకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి సమాధానం రాకపోయేసరికి మళ్లీ జనవరి 8వ తేదీన ఎస్టేట్స్ శాఖ నోటీసులు ఇచ్చింది. ఇంత వరకు బంగ్లాను ఎందుకు ఖాళీ చేయలేదని ప్రశ్నించింది. జనవరి 12వ తేదీ ఇంకో నోటీసు ఇచ్చింది. ఆ తర్వాత జనవరి 17వ తేదీన మరోసారి నోటీసులు జారీ అవ్వడంతో మహువా మొయిత్రా బంగ్లా ఖాళీ చేసి వెళ్లిపోయారు.