శనివారం కర్ణాటకలో(Karnataka) మంత్రివర్గ విస్తరణ జరిగింది. కాంగ్రెస్(Congress) తరపున మరో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత కర్ణాటక మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 34కి చేరింది

శనివారం కర్ణాటకలో(Karnataka) మంత్రివర్గ విస్తరణ జరిగింది. కాంగ్రెస్(Congress) తరపున మరో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత కర్ణాటక మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 34కి చేరింది. కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు దినేష్ గుండూరావు, శరణ్‌బసప్ప దర్శనపూర్, శివానంద్ పాటిల్, టి.ఆర్. బాలప్ప, కె. వెంకటేష్, డాక్టర్ హెచ్.సి.మహదేవప్ప, ఈశ్వర్ ఖండ్రే, కె. ఎన్. రాజన్న, హెచ్.కె. పాటిల్, కృష్ణ బైరే గౌడ, ఎన్. చెలునరస్వామి, మ‌ధు బంగార‌ప్ప‌తో స‌హా ప‌లువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రి పదవి దక్కకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రుద్రప్ప లమాని(Rudrappa Lamani) మద్దతుదారుల్లో ఆగ్రహం నెలకొంది. లమాని మద్దతుదారులు కాంగ్రెస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిన్న రాత్రి వరకు ప్రమాణస్వీకారం చేయ‌నున్న‌ నాయకుల జాబితాలో మా బంజారా సంఘం నాయకుడు రుద్రప్ప లమాని పేరు ఉందని.. నేడు ఆయన పేరు జాబితాలో లేదని ల‌మాని మద్దతుదారులు తెలిపారు. మా నాయకుడికి మంత్రి పదవి రాకపోతే నిరసన తెలుపుతామ‌న్నారు. కాంగ్రెస్ కు 75 శాతం ఓట్లు ఇచ్చాం కాబట్టి మా సామాజికవర్గం నుంచి కనీసం ఒక్క నాయకుడికైనా మంత్రి పదవి రావాలని అన్నారు.

కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, ప్రాంతీయ, కుల, సామాజిక న్యాయం దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. హైకమాండ్‌తో కూలంకషంగా చర్చించాకే మంత్రిమండలిని నిర్ణయించాం. వచ్చే మంత్రివర్గ సమావేశంలో మా హామీలపై నిర్ణయం తీసుకుంటాం. తదుపరి కేబినెట్ సమావేశం జూన్‌లో జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Updated On 27 May 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story