లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha election) ముందు కాంగ్రెస్ 'డొనేట్ ఫర్ దేశ్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) మాట్లాడుతూ.. దేశం కోసం విరాళం ఇవ్వాలని కాంగ్రెస్(Congress) తొలిసారి అడుగుతోంది. ధనవంతులపై ఆధారపడి పనిచేస్తే నిరంతరం వారి విధానాలను అంగీకరించాల్సి ఉంటుందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి మహాత్మా గాంధీ(Mahatma Gandhi) కూడా ప్రజల నుండి విరాళాలు అడిగారని గుర్తుచేశారు.

Donate For Desh

పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన భారతీయులు ఈ క్యాంపెయిన్ ద్వారా రూ.138, రూ.1,380, రూ.13,800 లేదా 10 రెట్లు విరాళంగా ఇవ్వవచ్చని తెలిపారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్(KC Venugopal) మాట్లాడుతూ 'డొనేట్ ఫర్ దేశ్' ప్రారంభించడం గర్వంగా ఉంది. పార్టీ చేసిన అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ఇదే అవుతుందని తెలిపారు. 28వ తేదీ నుంచి ఇంటింటికీ వెళ్లి ఒక్క పోలింగ్ బూత్‌లో కనీసం 10 ఇళ్లను సందర్శించి కాంగ్రెస్‌కు కనీసం రూ.138 సాయం చేయాలని.. రాష్ట్ర అధ్యక్షులందరికీ రెండు రోజుల క్రితం సర్క్యులర్ ద్వారా సూచించామని చెప్పారు.