కర్ణాటకలో ఎన్నికల(Karnataka Elections) తేదీలు దగ్గర పడుతున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ప్రాణాలకు ముప్పు ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబాన్ని హతమార్చేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai)కి చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి ఇష్టమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా (Randeep Singh Surjewala)అన్నారు.

Mallikarjun Kharge
కర్ణాటకలో ఎన్నికల(Karnataka Elections) తేదీలు దగ్గర పడుతున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ప్రాణాలకు ముప్పు ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబాన్ని హతమార్చేందుకు బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai)కి చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి ఇష్టమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా (Randeep Singh Surjewala)అన్నారు. అతని ఆడియో రికార్డింగ్‌ను బట్టి కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ప్రెస్‌మీట్‌లో సుర్జేవాలా ఆడియో క్లిప్‌ను ప్లే చేసి.. చిత్తాపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మణికాంత్ రాథోడ్.. ఖర్గేపై అనుచిత పదజాలం ఉపయోగించారని పేర్కొన్నారు. అలాగే ఖర్గే, ఆయన కుటుంబాన్ని చంపడం గురించి మాట్లాడటం విన్నాను. దీనిపై ప్రధాని మౌనంగా ఉంటారని నాకు తెలుసు.. దీనిపై కర్నాటక పోలీసులు, ఎన్నికల సంఘం కూడా మౌనంగానే ఉంటాయని, అయితే కర్ణాటక ప్రజలు మాత్రం మౌనంగా ఉండరని, తగిన సమాధానం చెబుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు.
