కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీఎం పదవికి పోటీ పడుతున్న కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య మంగళవారం న్యూఢిల్లీలో పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిశారు. అయితే.. ఇరువురు నేతల మధ్య అధికార భాగస్వామ్య ఒప్పందం కుదరకపోవడంతో.. ఏం జరగనుందా అనే ఉత్కంఠ మరీ ఎక్కువయ్యింది.

Congress likely to wait on Karnataka CM decision but Siddaramaiah holds edge
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి(Karnataka CM) ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీఎం పదవికి పోటీ పడుతున్న కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్(DK Shivakumar), సిద్ధరామయ్య(Siddaramaiah) మంగళవారం న్యూఢిల్లీ(Newdelhi)లో పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిశారు. అయితే.. ఇరువురు నేతల మధ్య అధికార భాగస్వామ్య ఒప్పందం కుదరకపోవడంతో.. ఏం జరగనుందా అనే ఉత్కంఠ మరీ ఎక్కువయ్యింది. మూలాల ప్రకారం.. సిద్ధరామయ్య సీఎం పదవిని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేరు. డీకే శివకుమార్ శిబిరంలోని ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నందున మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీఎం పదవి రేసులో ముందున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. డీకే శివకుమార్ శిబిరానికి చెందిన ఎమ్మెల్యేలు.. ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య తమ తరపున కూడా ప్రచారం చేసినందున వారు తటస్థంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చూస్తుంటే కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించడానికి కాంగ్రెస్ కు సమయం మరింత పట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) త్వరలో కర్ణాటకలో పర్యటించి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమై ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఖర్గేతో సమావేశమయ్యారు. రాహుల్, సోనియా గాంధీ(Sonia Gandhi) ముఖ్యమంత్రి పదవిపై ఖర్గే నిర్ణయానికి కట్టుబడుతామని చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో నిర్ణయం ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 అసెంబ్లీ స్థానాలకు గాను 135 స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్. బీజేపీని గద్దేదించిన ఇరువురు నేతలు.. ముఖ్యమంత్రి పీఠం కోసం పంతానికి పోతున్నారు.
