కర్ణాటకలో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం వచ్చింది. ఆత్మ విశ్వాసం అమాంతం పెరిగింది. విజయాలపై భరోసా ఏర్పడింది. సరికొత్త వ్యూహరచనలకు ప్రోద్బలమిచ్చింది. ప్రస్తుతం ఆ పార్టీ అదే పనిలో ఉంది. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీపై దృష్టి పెట్టింది. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటే కలిగే ప్రయోజనాలేమిటో లెక్కలేసుకుంది. పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, హైకమాండ్ కరుణిస్తే సీఎం పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్న నాయకుడు డీకే శివకుమార్ ద్వారా చర్చలు జరుపుతోంది. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకోవడం ద్వారా ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ బలపడవచ్చన్నది హస్తం పార్టీ ఆలోచనగా ఉంది.
కర్ణాటకలో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం వచ్చింది. ఆత్మ విశ్వాసం అమాంతం పెరిగింది. విజయాలపై భరోసా ఏర్పడింది. సరికొత్త వ్యూహరచనలకు ప్రోద్బలమిచ్చింది. ప్రస్తుతం ఆ పార్టీ అదే పనిలో ఉంది. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీపై దృష్టి పెట్టింది. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటే కలిగే ప్రయోజనాలేమిటో లెక్కలేసుకుంది. పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, హైకమాండ్ కరుణిస్తే సీఎం పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్న నాయకుడు డీకే శివకుమార్ ద్వారా చర్చలు జరుపుతోంది. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకోవడం ద్వారా ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ బలపడవచ్చన్నది హస్తం పార్టీ ఆలోచనగా ఉంది. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానుల ఓట్లను పొందవచ్చు. పనిలోపనిగా ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి చెక్ పెట్టవచ్చు. షర్మిల కనుక కాంగ్రెస్‌లో చేరితే ఆంధ్రప్రదేశ్‌లో అడుగంటిన ఆశలకు కొత్త ఊపిరి లభిస్తుందని, పార్టీ బలం కచ్చితంగా పెరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటు తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉంటాయి. పైగా వైఎస్‌ఆర్ అభిమానులే కాదు, రెడ్డి సామాజికవర్గం, క్రిస్టియన్ సామాజికవర్గం ఓట్లను తమవైపు తిప్పుకోవచ్చన్నది కాంగ్రెస్ ఆలోచన.
తెలంగాణలో జరిపిన పాదయాత్రలతో షర్మిలకు కొంత ఆదరణ లభించిందని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రజావ్యతిరేక చర్యలపై పోరాడుతున్న షర్మిలను పార్టీలో చేర్చుకుంటే కొంత కలిసి వస్తుందన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట! కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత షర్మిల బెంగళూరుకు వెళ్లారు. మూడు రోజులుగా అక్కడే ఉంటూ పార్టీ విలీన అంశాలపై డీకే శివకుమార్‌తో కలిసి చర్చించారట. ప్రస్తుతం శివకుమార్ తీరిక లేకుండా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒక్కసారి కర్ణాటక వ్యవహారం కొలిక్కి వచ్చిన తర్వాత డీకే శివకుమార్‌కు కాసింత వెసులుబాటు లభిస్తుంది. అప్పుడు విస్తృతంగా చర్చలు జరుపుకోవచ్చని షర్మిల భావిస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ఆల్‌రెడీ షర్మిల ప్రకటించారు. ఆ స్థానంతో పాటుగా తన పార్టీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలను షర్మిల కోరుతున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ తరఫున పని చేస్తున్నారు. ఆయన షర్మిలతో మాట ముచ్చట జరుపుతున్నారట. విలీన ప్రతిపాదనపై ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు కూడా జరిగాయట. సునీల్ కనుగోలు దగ్గర చెప్పిన కొన్ని అంశాలను ఆయన హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారట.
ఇదిలా ఉంటే , కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల బెంగళూరులో ఆయనను కలిశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోను షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రియమైన సోదరుడు శ్రీ డీకే శివకుమార్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత జరుపుకొనే ఈ పుట్టిన రోజు మీకు మరింత మధురమైనదని, ముఖ్యమైనదని భావిస్తున్నాను. కర్ణాటక ప్రజలకు సేవ చేసేందుకు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అంటూ కామెంట్ చేశారు షర్మిల.