సీడబ్ల్యూసీ సమావేశాల్లో(CWC Meetings) పాల్గొనేందుకు కాంగ్రెస్(Congress) కీలక నేతలంతా హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia gandhi), ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(ICC rahul gandhi) సహా ముఖ్య నేతలకు రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలికింది.
సీడబ్ల్యూసీ సమావేశాల్లో(CWC Meetings) పాల్గొనేందుకు కాంగ్రెస్(Congress) కీలక నేతలంతా హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia gandhi), ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(rahul gandhi) సహా ముఖ్య నేతలకు రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలికింది. కాంగ్రెస్ అగ్రనేతలంతా రెండు రోజుల పాటు హైదారాబాద్‌లోనే ఉండనున్నారు. హోటల్ తాజ్ కృష్ణలో(Taj Krishna) రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. రేపు సాయంత్రం తుక్కుగుడాలో(Tukkuguda) జరుగనున్న భారీ బహిరంగ సభతో(Public Meet) సమావేశాలు ముగుస్తాయి.
తెలంగాణాతోపాటు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే శని, ఆదివారాల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్య్లుసి) సమావేశాలు హైదరాబాద్ కేంద్రంగా జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనబోయే ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం విలేకర్లతో మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యూహరచనపై పార్టీ అగ్రనేతలు ఈ సిడబ్ల్యుసి సమావేశాల్లో చర్చించనున్నారు. ఇండియా కూటమిపై, కూటమిలోని మా భాగస్వాములతో తదుపరి సమావేశంలో చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న తొలి సిడబ్ల్యుసి సమావేశం ఇదే కావడం విశేషం.