V.Hanumantha Rao : మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు.. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
ప్రతిపక్ష పార్టీల I-N-D-I-A కూటమిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు(Hanumantha Rao) మండిపడ్డారు. సోనియా గాంధీ(Sonia Gandhi) చరిత్ర అమిత్ షాకు(Amit shah) తెలుసా అని ప్రశ్నించారు. ప్రధాని పదవి త్యాగం చేసిన నాయకురాలు సోనియా గాంధీ.. రాహుల్ గాంధీని(Rahul gandhi) ప్రధాని చేయాలని సోనియా అనుకుంటే ఆరోజే చేసేదని తెలిపారు.

V.Hanumantha Rao
ప్రతిపక్ష పార్టీల I-N-D-I-A కూటమిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు(Hanumantha Rao) మండిపడ్డారు. సోనియా గాంధీ(Sonia Gandhi) చరిత్ర అమిత్ షాకు(Amit shah) తెలుసా అని ప్రశ్నించారు. ప్రధాని పదవి త్యాగం చేసిన నాయకురాలు సోనియా గాంధీ.. రాహుల్ గాంధీని(Rahul gandhi) ప్రధాని చేయాలని సోనియా అనుకుంటే ఆరోజే చేసేదని తెలిపారు. సోనియా గాంధీ దేశం కోసం పనిచేస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని.. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేసేలా ప్రధాని మోదీ నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు.
మణిపూర్(Manipur) ఘటనపై ప్రధాని ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులు మణిపూర్ వెళుతుంటే.. ఇప్పుడు అమిత్ షా మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ, కేసీఆర్(KCR) ఇద్దరు తోడు దొంగలు.. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు దేశ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని వీహెచ్ అన్నారు. త్వరలోనే కాంగ్రెస్(congress) బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తుందని అన్నారు. బీసీ జనగణన చేస్తాక.. రిజర్వేషన్ పెంపుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
