కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు.

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్యలతో ఆమె గురువారం ఉదయం దిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నట్లు సర్‌ గంగారాం ఆసుపత్రి బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఛైర్మన్‌ అజయ్‌ స్వరూప్‌ తెలిపారు. గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్‌ సమీరన్‌ నందీ సోనియాగాంధీ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారన్నారు. గతేడాది సెప్టెంబర్‌లోనూ అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలు ఆస్పత్రికి వెళ్లి సోనియాను పరామర్శించారు.

ehatv

ehatv

Next Story