ఇప్పుడు దేశంలో ది కేరళ స్టోరీ సినిమాపై బోల్డంత చర్చ జరుగుతోంది. చర్చ జరుగుతోందనడం కంటే వివాదం నడుస్తోంది అనడం బెటర్! ఎందుకంటే ఒక్క కేరళకే వివాదం పరిమితం కాలుదు. మరో అయిదు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై కేరళలో అయితే బీజేపీయేతర పార్టీలన్నీ మండిపడుతున్నాయి. సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు దేశంలో ది కేరళ స్టోరీ సినిమాపై బోల్డంత చర్చ జరుగుతోంది. చర్చ జరుగుతోందనడం కంటే వివాదం నడుస్తోంది అనడం బెటర్! ఎందుకంటే ఒక్క కేరళకే వివాదం పరిమితం కాలుదు. మరో అయిదు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై కేరళలో అయితే బీజేపీయేతర పార్టీలన్నీ మండిపడుతున్నాయి. సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. 'ఇది మీ కేరళ కథ అయితే కావొచ్చు. మా కేరళ కథ మాత్రం కాదు' అని నిర్మాతలను ఉద్దేశించి సామాజిక మాధ్యమాలలో ఓ పోస్ట్ పెట్టాడు. చిత్ర పోస్టర్‌ను కూడా షేర్ చేశారు.
కేరళలో ఆ మధ్యన 32 వేల మంది మహిళలు మిస్సింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇందులో నిజం లేదని, అన్ని వదంతులేనని ప్రభుత్వం చెప్పింది. ఈ ఆరోపణలను బేస్ చేసుకుని సినిమా తీశారు. దీనిపై కేరళ స్టేట్ కమిటీ ఆఫ్ ముస్లిం యూత్‌లీగ్ సవాల్ కూడా విసిరింది. ఈ సినిమాలో 32 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చూపించారు కదా, దీన్ని ఆధారాలతో సహా నిరూపించిన వారికి కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో ఆధారాల స్వీకరణ కోసం కలెక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. ఈ సవాలు గురించి కూడా శశిథరూర్ ట్విటర్‌లో పోస్టు పెట్టారు. అలాగే NotOurKeralaStory అనే హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా సినిమాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మత సామరస్యంతో విరాజిల్లుతున్న కేరళలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంఘీయులు చేస్తున్న కుట్రలో భాగమే ఈ సినిమా అని విజయన్ అన్నారు. కేరళను మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. పచ్చని కేరళలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ గుప్తా మాత్రం సినిమా చూసిన తర్వాత మాట్లాడాలని కోరుతున్నాడు. సినిమా నచ్చకపోతే అప్పుడు చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామని అంటున్నారు.