బీజేపీ(BJP) అధికారంలో ఉన్న అసోంలో(Assam) కాంగ్రెస్(Congress) నాయకుడు రాహుల్‌గాంధీని(Rahul gandhi) పదే పదే అడ్డుకుంటున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రకు విఘాతాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
బీజేపీ(BJP) అధికారంలో ఉన్న అసోంలో(Assam) కాంగ్రెస్(Congress) నాయకుడు రాహుల్‌గాంధీని(Rahul gandhi) పదే పదే అడ్డుకుంటున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రకు విఘాతాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ(Himanta Biswa Sharma) పనిగట్టుకుని ఈ పనిలోనే ఉన్నారు. సోమవారం ఉదయం బటాద్రవథాన్ ఆలయ(Batadravathan Temple) సందర్శనానికి వెళ్లి రాహుల్ గాంధీని అధికారులు అడ్డుకున్నారు. ఆయనను లోపలికి అనుమతించలేదు. తాము ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నామని, తామేం నేరం చేశామని ఆలయంలోకి అనుమతించడం లేదని రాహుల్ ప్రశ్నించారు. పూజలు చేసి వెళతామని, ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీ(Narendra modi) నిర్ణయిస్తారా ఏమిటి అంటూ అధికారులను నిలదీశారు. ఆ ఘటన తర్వాత నాగోవ్‌లో స్థానిక నేతలు, కార్యకర్తలతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అయితే అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయ్యాక మధ్యాహ్నాం మూడు గంటల తర్వాతే ఆలయంలోకి రాహుల్ గాంధీని అనుమతిస్తామని ఆలయ నిర్వాహకులుచెబుతున్నారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీమంత శంకర్‌దేశ్ జన్మస్థం బటాద్రవథాన్ అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ జోడో యాత్ర బీజేపీ శ్రేణులు జరిపిన దాడి ఉద్దేశపూర్వకమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇవాళ సాయంత్రం దేశవ్యాప్త నిరసనలకు పార్టీ పిలుపు ఇచ్చింది.