వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) కాంగ్రెస్(congress) 150 సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎన్నికల సన్నద్ధత సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) కాంగ్రెస్(congress) 150 సీట్లు గెలుచుకుంటుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎన్నికల సన్నద్ధత సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో విజయం సాధించాం.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయపరంపరను కొనసాగిస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీలో 230 సీట్లు ఉన్నాయి.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రకటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shiva Raj Singh Chuhan) మాట్లాడుతూ.. మనసుకు వినోదాన్ని పంచే ఆలోచనలు మంచివే అంటూ సెటైర్లు సంధించారు. కాంగ్రెస్ ఊహల్లో తేలియాడుతుందన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ 200 సీట్లకు పైగా గెలుస్తుందని అన్నారు.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో(Mallikarjun Kharge) కలిసి మధ్యప్రదేశ్‌కు చెందిన పార్టీ అగ్రనేతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్, ఏఐసీసీ(AICC) ఇంచార్జ్ పి.అగర్వాల్(P.Aggarwal) తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ.. చాలాసేపు చర్చించుకున్నాం. కర్ణాటకలో 136 సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో 150 సీట్లు సాధించబోతున్నాం. కర్ణాటకలో ఏం చేశామో, (మధ్యప్రదేశ్‌లో) అదే పునరావృతం కాబోతుందన్నారు. కమల్ నాథ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థినా.. అనే ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ధాటవేశారు.