హమ్మయ్యా... ఇన్నాళ్లకు కాంగ్రెస్(congress) నాయకుడు రాహుల్ గాంధీ(Rahul gandhi) నోటి వెంట పెళ్లి(Marriage) ముచ్చట వచ్చింది. ఇక పెళ్లి చేసుకోక తప్పదేమోనని ఆయన చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) రాయబరేలీలో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ కేంద్రంలో బీజేపీ(BJP) సారథ్యంలోని ఎన్డీయే సర్కారు విధానాలపై విరుచుకుపడ్డారు.
హమ్మయ్యా... ఇన్నాళ్లకు కాంగ్రెస్(congress) నాయకుడు రాహుల్ గాంధీ(Rahul gandhi) నోటి వెంట పెళ్లి(Marriage) ముచ్చట వచ్చింది. ఇక పెళ్లి చేసుకోక తప్పదేమోనని ఆయన చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) రాయబరేలీలో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ కేంద్రంలో బీజేపీ(BJP) సారథ్యంలోని ఎన్డీయే సర్కారు విధానాలపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాయబరేలీతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, అమ్మ సోనియా గాంధీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, ఇది తమకు కర్మ భూమి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో సభకు హాజరైన కొందరు రాహుల్‌గాంధీని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ అడిగారు. దానికి రాహుల్ స్పందిస్తూ ఇప్పుడిక నేను త్వరలో పెళ్లి చేసుకోక తప్పేలా లేదు (అబ్ జల్దీ హి కర్నీ పడేగీ) అని నవ్వుతూ బదులిచ్చారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ప్రియాంకగాంధీ ముసిముసి నవ్వులు నవ్వారు.