కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లడఖ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కార్గిల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కొన్ని నెలల క్రితం ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచామని..
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లడఖ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కార్గిల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కొన్ని నెలల క్రితం ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచామని.. దేశంలో బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ వ్యాప్తి చేస్తున్న ద్వేషం, హింసకు వ్యతిరేకంగా నిలబడటమే దీని లక్ష్యం అని రాహుల్ అన్నారు.
రాహుల్ గాంధీ తన ప్రసంగంలో చైనా అంశాన్ని కూడా లేవనెత్తారు. భారత్ భూమిని చైనా లాక్కుందని ఒక విషయం స్పష్టంగా అర్థమైందన్నారు. లడఖ్‌లో ఒక్క అంగుళం కూడా చైనా స్వాధీనం చేసుకోలేదని విపక్షాల సమావేశంలో ప్రధాని చెప్పడం బాధాకరమన్నారు. ఇది పూర్తిగా అబద్ధం. ప్రాజెక్టు ఏర్పాటు కోసం మీ భూమిని లాక్కొని అదానీకి ఇవ్వాలని బీజేపీ భావిస్తోందని అన్నారు. లడఖ్ భూమిని చైనా కబ్జా చేసిందనే విషయం మొత్తం తెలిసిందన్నారు. 'విద్వేషాల మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరవడానికి మేము బయలుదేరాము' అని రాహుల్ అన్నారు. యాత్ర సమయంలో నేను లడఖ్‌ను సందర్శించలేకపోయాను. ఆ సమయంలో చాలా మంచు కురిసింది. లడఖ్ నా హృదయంలో ఉంది. అందుకే ఈసారి మోటారు సైకిల్‌పై వచ్చానని తెలిపారు.