రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటులో జరిగిన చర్చ సందర్బంగా అధికార పక్షం మరీ ముఖ్యంగా బీజేపి దేశ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని యివ్వ దలచిందో అర్ధం కాలేదు.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటులో జరిగిన చర్చ సందర్బంగా అధికార పక్షం మరీ ముఖ్యంగా బీజేపి దేశ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని యివ్వ దలచిందో అర్ధం కాలేదు.
మన రాజ్యాంగం సమస్త దేశ ప్రజలను, ప్రాంతాలకు, భాషలకు, మతాలకు , కులాలకు అతీతంగా అందరినీ కలిపి వుంచి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్న పవిత్ర గ్రంధం,బాబా సాహెబ్ అంబెడ్కర్ అందించిన మన రాజ్యాంగం. ఆ నాడు కాంగ్రెస్ పార్టీ మరియు పార్టీ పెద్దలు అంబేద్కర్ గారి విశిష్ట జ్ఞానాన్ని గుర్తించి వారిని రాజ్యాంగ రచనా కమిటీ కీ చైర్మన్ భాద్యతలు అప్పగించి తగు రీతిన గౌరవించింది,
ఆ సందర్బంగా అనేక మంది వారి వారి అభిప్రాయాలను వ్యక్త పరిచారు.
అంతిమంగా బాబా సాహెబ్ ఆలోచలకు అనుగుణంగా రాజ్యాంగం నిర్మాణం జరిగి, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ పటేల్, మౌలానా అబుల్ కలాం అజాద్ వంటి నాయకుల సహకారంతో ఆమోదం పొందింది.
రాజ్యాంగం యొక్క 75 సంవత్సరాల ఘన చరిత్రలో దేశ నిర్మాణంలో భాగమైన పెద్దలను వారి త్యాగాలను, దూరదృష్టిని చిన్నది చేసి చూపే అల్ప బుద్ది, హొ మంత్రి అమిత్ షా రాజ్య సభలో , దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారిపై
చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం అక్షేపనీయం, ఖండనీయం .
ఆ యా యుగాలలో మానవులుగా జన్మించి వారి ప్రవర్తన ద్వారా శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు భగవంతుని గా కీర్తింప బడుతున్నారో, ఈ నాటి మన భారత ప్రజాస్వామ్య యుగంలో అంబేద్కర్ కచ్చితంగా దేవుడే వారిని స్మరించ కుండా కీర్తించకుండా వుండలేము.
అమిత్ షా తను చేసిన వ్యాఖ్యలకు గాను తక్షణం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము.