ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అక్కడ ఓ జోక్ వినిపించారు. కార్యక్రమంలో ఉన్నవారు పగలబడి నవ్వారు.. కాకపోతే మోదీ వినిపించిన జోక్‌పైనే విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విమర్శలు వస్తున్నాయి. మోదీ వేసింది జోక్‌కాదని, అది విషాదభరితమైన అంశమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) విమర్శించారు.
ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అక్కడ ఓ జోక్ వినిపించారు. కార్యక్రమంలో ఉన్నవారు పగలబడి నవ్వారు.. కాకపోతే మోదీ వినిపించిన జోక్‌పైనే విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విమర్శలు వస్తున్నాయి. మోదీ వేసింది జోక్‌కాదని, అది విషాదభరితమైన అంశమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) విమర్శించారు. మోదీ తన చిన్ననాటి ముచ్చట చెబుతూ ఓ జోక్‌ను గుర్తు చేసుకున్నారు. 'ఓ ప్రొఫెసర్ కూతురు సూసైడ్ నోట్ రాసింది. అందులో ఆమె కాంకరియా నదిలో దూకి చావనున్నట్టు పేర్కొంది. అయితే ఆ సూసైడ్‌ను చూసిన ప్రొఫెసర్ అందులో కాంకరియా పేరును తన కూతురు తప్పుగా రాసిందని కోపం తెచ్చుకుంటాడు' అని ప్రధాని మోదీ చెప్పారు. ఆ జోక్‌కు సదస్సులో ఉన్నవారు గట్టిగా నవ్వారు. విద్యార్థుల ఆత్మహత్యలపై మోదీ జోక్ వేసిన తీరు బాగోలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను ప్రియాంకా గాంధీ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సున్నితమైన విషయాలలో మోదీ ప్రదర్శించిన తీరును ఆమె తప్పుపట్టారు. యువతలో డిప్రెషన్, సూసైడ్ అంశాలు నవ్వుకునేవి కావన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా(National Crime Records Bureau) ప్రకారం 2021లో లక్షా 64 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఇందులో అధిక శాతం 30 ఏళ్లలోపువారేనని ప్రియాంక గుర్తు చేశారు. ఇది విషాదమే తప్ప జోక్ కాదని చెప్పారు.