భారతీయులకు(Indians) అమెరికాలో(america) ఉద్యోగం చేయాలన్నది ఓ కల.
భారతీయులకు(Indians) అమెరికాలో(america) ఉద్యోగం చేయాలన్నది ఓ కల. ఎలాగైనా సరే H-1B వీసా(H1B Visa) సంపాదించాలన్న బలమైన ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది. ప్రతీ ఏడాది ఏప్రిల్ మాసంలో అమెరికా ప్రభుత్వం H-1B వీసాల జారీ కోసం ఓ లాటరీ(Lottery) నిర్వహిస్తుంటుంది. ఈ ప్రోగ్రామ్‌ను వేలాది మంది మధ్యవర్తులు తమకు నచ్చినవారికి కేటాయించుకుంటారు. ఎలా అంటే అదో స్కాము. చాలా పరిమిత సంఖ్యలో ఈ వీసాలను కేటాయిస్తారు. అదీ నిపుణత కలిగిన వారికే . టెక్ దిగ్గజాలు, స్టార్టప్‌లు, బ్యాంకులు, డ్రగ్ మేకర్‌లు(Drug makers) ఇలా అందరూ ఈ స్లాట్ కోసం పోటీపడుతున్నారు. ఇక్కడే అసలైన మంత్రాంగం నడుస్తోంది. ఇందులో కూడా పెద్ద కుంభకోణం(Scam) ఉంది. ఇందులో ఆదిలాబాద్(adilabad) అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్(congress) అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డి(Kandhi Srinivas reddy) కూడా ఉన్నారన్నది సమాచారం. హెచ్1బీ-వీసా రిగ్గింగ్‌లో(H1B Visa Rigging) ప్రధాన నిందితుల్లో ఈయన కూడా ఒకరు.
H-1B వీసా లాటరీలో ఉన్న లొసుగులను కొందరు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. లాస్టియర్ 4,46,00 మంది H-1B వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందుబాటులో ఉన్న వీసాలు మాత్రం 85 వేలు మాత్రమే! హెచ్-1 బీ వీసాలు దొరికిన అదృష్టవంతుల్లో చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలలో పని చేయడానికి వెళ్లారు. అమెజాన్(amazon), ఇంటెల్(Intel), జేపీమోర్గాన్ వంటి సంస్థలు వీరికి ఉద్యోగాలను ఇచ్చాయి. లాటరీ అంటేనే అదృష్టం. అందుకే నాలుగైదు దరఖాస్తులు చేస్తే వీసా దొరికే ప్రాపబులిటీ పెరుగుతుంది. దీన్ని ఉపయోగించుకున్న కొందరు భారీ స్కామ్‌కు తెర తీశారు. ఒకే అభ్యర్థి 15 సార్లు H-1B వీసా దరఖాస్తు చేసినట్టు వెలుగులోకి రావడంతో అధికారులు కూపీలాగడం మొదలు పెట్టారు. ఇదో పెద్ద స్కామ్ అని వారికి తెలిసింది. ఈ స్కామ్‌లో కంది శ్రీనివాస్‌రెడ్డి కూడా ఉన్నట్టు సమాచారం! అందుబాటులో ఉన్న 85 వేల H-1B వీసాలలో 11,600 వీసాలు బహుళజాతి అవుట్ సోర్సింగ్ కంపెనీలు దక్కించుకున్నాయి. H-1B వీసా దొరికిన 22,600 మంది ఐటీ కంపెనీలకు వెళ్లారు. అయితే ఒకే ఉద్యోగి కోసం బహుళ ఎంట్రీలను సమర్పించడం ద్వారా భారీ స్థాయిలో మోసం జరిగినట్టు అధికారులు గుర్తించారు. బ్లూమ్‌బెర్గ్ అంచనా ప్రకారం సుమారు 15,500 వీసాలు ఇలా మోసంతో దక్కించుకున్నవేనని తేలింది. అంటే లాస్టియర్ కేటాయించిన హెచ్1 బీ వీసాలలో ప్రతి ఆరింటిలో ఒకటి ఇలా లాటరీని గేమింగ్ చేసి సంపాదించినదే! నాలుగేళ్ల వ్యవధిలో, ఒక స్టాఫింగ్ ఫర్మ్ ఆపరేటర్ ఒకే దరఖాస్తుదారులను 15 సార్లు నమోదు చేయడానికి ఒక డజను కంపెనీలను ఉపయోగించారని రుజువయ్యింది. దీనివల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయారు. వీసాలు దక్కాల్సిన వారికి దక్కకుండా పోయాయి.