హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana Assembly elections) ఫలితాలు అటు కాంగ్రెస్‌తో(COngress), ఇటు బీజేపీతో(BJP) దోబూచులాడుకున్నాయి.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల(Haryana Assembly elections) ఫలితాలు అటు కాంగ్రెస్‌తో(COngress), ఇటు బీజేపీతో(BJP) దోబూచులాడుకున్నాయి. ఎన్నికల ఫలితాల సరళిలో నిమిషనిమిషానికి తేడా కనిపించింది. మొదట కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబర్చింది. ఎగ్జిట్ ఫలితాలు నిజమవుతున్నట్టుగానే అనిపించింది. సడన్‌గా బీజేపీ దూసుకొచ్చింది. కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళుతోంది. ఈ ఎన్నిలక డేటాపై సహజంగానే కాంగ్రెస్‌కు అనుమానాలు వచ్చాయి. ఈసీ(EC) వెబ్‌సైట్‌లో మందకొడిగా సమాచారాన్ని అప్‌డేట్ చేయడంపై కాంగ్రెష్ విమర్శలు చేసింది. ఈ మేరకు సీనియర్ నేత జైరాం రమేశ్(Jayram ramesh) ఎక్స్ వేదికగా స్పందించారు. 'లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమయంలోలాగే హర్యానా ఎన్నికల ఫలితాల వేళ కూడా ఫలితాల సరళిని ఎప్పటికప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయడంలో ఆలస్యం జరిగింది. కాలం చెల్లిన, తప్పుదోవ పట్టించే ట్రెండ్స్‌ను షేర్ చేస్తూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేలా బీజేపీ ప్రయత్నిస్తోందా..?’’ అని జైరాం రమేశ్ ప్రశ్నించారు. మీడియాలో వస్తోన్న రిజల్ట్స్ ట్రెండ్ పోల్చినప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ ఆలస్యంగా ఉండటంపై జైరాం రమేశ్ రియాక్టయ్యారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాస్తవమైన, కచ్చితమైన గణాంకాలతో వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేలా అధికారులకు తక్షణం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలా కీడు చేసే తప్పుడు వార్తలను కట్టడి చేయవచ్చని ఈసీకి తెలిపారు జైరాం రమేశ్!