మహిళా రిజర్వేషన్(Women Reservation) అమలు విషయంలో మోదీకి(Modi) చిత్తశుద్ధి లేదని తెలంగాణ మహిళ.కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్(Sunitha Rao) విమర్శించారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళా ఓటర్ల శాతమే ఎక్కువ కాబట్టి మహిళలోకాన్ని మభ్య పెట్టడానికి చేస్తున్నట్టుంది ఈ జిమ్మిక్కు.. మహిళా లోకం మోదీని ఎప్పటికీ క్షమించదు అని అన్నారు.
మహిళా రిజర్వేషన్(Women Reservation) అమలు విషయంలో మోదీకి(Narendra Modi) చిత్తశుద్ధి లేదని తెలంగాణ మహిళ.కాంగ్రెస్(Congress) అధ్యక్షురాలు సునీతా రావ్(Sunitha Rao) విమర్శించారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళా ఓటర్ల శాతమే ఎక్కువ కాబట్టి మహిళలోకాన్ని మభ్య పెట్టడానికి చేస్తున్నట్టుంది ఈ జిమ్మిక్కు.. మహిళా లోకం మోదీని ఎప్పటికీ క్షమించదు అని అన్నారు.
మణిపూర్‌లో(Manipur) మహిళలని నగ్నంగా ఊరేగించిన వాళ్ల మీద చర్యలు తీసుకోలేని మోదీ.. డబల్ ఇంజన్ సర్కార్ మహిళా లోకాన్ని ఉద్ధరిస్తది అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని అన్ఆనరు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా.. అమలు చేయడానికి జనాభా గణన అవసరం.. ఈ విషయం తెలిసి కూడా జనాభా గణన చేపట్టకుండా.. మహిళా రిజర్వేషన్ బిల్లు అనే పేరుతో కొత్త నాటకానికి మోదీ తెర లేపారని అన్నారు.
2030 లో చేపట్టే జనగణన ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేసే ఉద్దేశం ఉన్నప్పుడు.. ముందుగా జనగణన చేపట్టి ఉండాల్సిందని అన్నారు. జనగణనకు అనుగుణంగా సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉందని అన్నారు. మాయమాటలు నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని.. రాబోయే ఎన్నికల్లో మహిళాలోకం ఆగ్రహానికి మోదీ గురికాక తప్పదని అన్నారు.