ఇండియా కూటమి(INIDA Alliance ) సమావేశం తేదీ ఖరారైంది. డిసెంబర్ 19న దేశ రాజధాని న్యూఢిల్లీలో(New Delhi) భేటీ కానుంది. కూటమి నాలుగో సమావేశం(Fourth Meet) వివరాలను కాంగ్రెస్(Congress) సీనియర్ నేత జైరాం రమేష్(Jayaram Rameh) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే కూటమిలోని కీలక నేతలతో సయోధ్య కుదరడంతో డిసెంబర్ 19వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు న్యూఢిల్లీలో కూటమి నాలుగో సమావేశం ప్రారంభం కానుంది.

ఇండియా కూటమి(INIDA Alliance ) సమావేశం తేదీ ఖరారైంది. డిసెంబర్ 19న దేశ రాజధాని న్యూఢిల్లీలో(New Delhi) భేటీ కానుంది. కూటమి నాలుగో సమావేశం(Fourth Meet) వివరాలను కాంగ్రెస్(Congress) సీనియర్ నేత జైరాం రమేష్(Jayaram Rameh) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే కూటమిలోని కీలక నేతలతో సయోధ్య కుదరడంతో డిసెంబర్ 19వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు న్యూఢిల్లీలో కూటమి నాలుగో సమావేశం ప్రారంభం కానుంది.

ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ(BJP) విజయం సాధించగా..కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. అయితే తెలంగాణలో(telangana) మాత్రం కాంగ్రెస్(congress) అధికారంలోకి రావడం ఆ పార్టీకి ఉపశమనం కలిగించే అంశం. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19న జరిగే ఇండియా కూటమి సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. కూటమిలో వివిధ పార్టీల నేతల మధ్య తలెత్తిన విభేదాలను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించకుండానే ఏకపక్షంగా టికెట్లు ప్రకటించడంతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్..కాంగ్రెస్‎పై బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో అప్పటి వరకు కూటమిలో ఉన్న అంతర్గతంగా విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.

ఇక ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవి చూసిన సంగతి తెలిసిందే. అయితే పొత్తు లేకుండా పోటీ చేయడం వల్లే ఓడిపోయామని కాంగ్రెస్ సహా.. కూటమిలోని పార్టీలు భావిస్తున్నాయి. ఈ సమావేశంతో కూటమి పార్టీలు ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పట్ల కొంత ఆగ్రహంతో ఉన్న సమాజ్ వాదీ పార్టీ(Samajwadi Party) అధినేత అఖిలేష్ యాదవ్(Akilesh Yadav) చల్లబడ్డారు. ఇండియా అలయన్స్ బలోపేతం కోసం ఆయన సానుకూల వ్యక్తం చేశారు. వచ్చే లోక్‎సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) కాంగ్రెస్‎తో కలిసి బీజేపీని ఓడిస్తామని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.

మరో కొన్ని నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై వేదికగా జరుగనున్న కూటమి నాలుగో సమావేశానికి అత్యంత ప్రధాన్యత ఏర్పడింది. కూటమి తొలి సమావేశానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ పాట్నాలో అతిథ్యమివ్వగా.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో బెంగళూరులో రెండో సమావేశం జరిగింది. ఇక మూడో సమావేశం దేశ వాణిజ్య రాజధాని ముంబైలో నిర్వహించారు. ఇక ముంబై వేదికగా జరుగనున్న ఇండియా కూటమి నాలుగో సమావేశంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు ప్రధాన ఎజెండగా ఈ సమావేశం జరగనున్నట్లు కూటమి వర్గాలు తెలిపాయి. అలాగే సానుకూల అజెండా రూపకల్పన, ఉమ్మడి ర్యాలీల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అయితే తొలుత డిసెంబర్ 6న కూటమి సమావేశం నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. కీలక నేతలు అందుబాటులో లేకపోవడంతో వాయిదాపడింది. బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ సుముఖంగా లేకపోవడంతో సమావేశం రద్దయింది. జ్వరం కారణంగా హాజరుకాలేకపోతున్నానని నితీష్ వివరణ ఇవ్వగా.. తనకు ముందస్తు సమచారం లేదని, వేరే కార్యక్రమం ఖరారైందని మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రంలో తుఫాను కారణంగా తాను రాలేకపోతున్నట్టు ఎంకే స్టాలిన్ చెప్పారు. ఈసారి కూటమి సమావేశంలో అఖిలేష్ యాదవ్ సహా..ముఖ్య నేతలంతా పాల్గొనే అవకాశం ఉంది. టీఎంసీ అధినేత్రి మమత ఈనెల 17-19మధ్యలో ఢిల్లీలో ఉంటారు. ఆమె కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మొత్తానికి న్యూఢిల్లీలో ఈనెల 19న జరుగనున్న సమావేశంలో 2024 ఎన్నికల్లో సమష్టిగా పోటీ చేస్తామనే తీర్మానాన్ని కూటమి పార్టీలు ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో అన్ని పార్టీలు వ్యవహరించాలనే అంశంపై ఏకాభిప్రాయానికి రానున్నాయి. "జుడేగా భారత్, జీతేగా ఇండియా" అనే నినాదంతో ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లనుంది.

Updated On 11 Dec 2023 3:02 AM GMT
Ehatv

Ehatv

Next Story