కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(karnataka Assembly elections) కాంగ్రెస్(congress) పార్టీ మెజారిటీ మార్క్ కంటే ఎక్కువ సీట్లనే సాధించింది. స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఆపరేషన్ కమలం ప్రభావం తమ మీద పడకుండా ఉండేందుకు వ్యూహరచన చేస్తోంది.

Tamilnadu CM Stalin
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(karnataka Assembly elections) కాంగ్రెస్(congress) పార్టీ మెజారిటీ మార్క్ కంటే ఎక్కువ సీట్లనే సాధించింది. స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఆపరేషన్ కమలం ప్రభావం తమ మీద పడకుండా ఉండేందుకు వ్యూహరచన చేస్తోంది. బీజేపీ(BJP) ఎంతకైనా తెగిస్తుందన్న విషయం కాంగ్రెస్‌కు తెలియంది కాదు. అందుకే తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. విజయం సాధించిన ఎమ్మెల్యేలను తమిళనాడుకు తరలించేందుకు ఆలోచిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.
ఈ రోజు సాయంత్రానికి విజేతలందరిని బెంగళూరుకు చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఫలితాలు తమకు అనుకూలంగా వస్తుంటంతో కాంగ్రెస్‌లో ఉత్సాహం పెరిగింది. ట్విట్టర్‌లో తమ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ జోడో యాత్ర వీడియోను కాంగ్రెస్ పోస్ట్ చేసింది. ‘నేను అజేయంగా ఉన్నాను. నేను నమ్మకంగా ఉన్నాను. నన్నెవ్వరూ ఆపలేరు’ అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలను జోడిచింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రే కారణమని చాలా మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. జోడో యాత్ర ప్రజలను ఉత్తేజపరిచిందని, అధికార బీజేపీపై ప్రభావం చూపిందని అంటున్నారు.
