కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం.. మన్మోహన్ అంత్యక్రియలు జరిగే రోజు ఒకటే అవడం యాదృచ్ఛికమే.

1885 వ సంవత్సరం డిసెంబర్ 28 న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ప్రతి సంవత్సరం ఈ రోజున దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అవతరణ దినోత్సవ సంబరాలు నిర్వహిస్తాయి. పార్టీ కార్యాలయాల్లో పలు కార్యక్రమాలు, సభలు నిర్వహిస్తారు. అయితే ఈ సారి మాత్రం అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానంతరం, ఆయన భౌతకకాయాన్ని ఈ రోజు AICC కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడికి కాంగ్రెస్ ముఖ్య నేతలు అందరూ చేరుకుని ఆయనకు నివాళులు అందిస్తున్నారు. ఈ రోజు నిఘం బోధ్ ఘాట్ లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

అయితే మన్మోహన్ సింగ్ మరణానికి, సంతాపంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆవిర్భావ కార్యక్రమాలను రద్దు చేసింది. వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.

ehatv

ehatv

Next Story