కాంగ్రెస్(Congress) మాజీ నేత, డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ(Democratic Azad Party) చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇస్లాం(Islam) మతం కన్నా హిందూ మతం(Hindu Religion) చాలా పురాతనమైందని, ముస్లింలంతా ఒకప్పుడు హిందువులే అని ఆయన అన్నారు. దేశంలోని పౌరులంతా ముందు హిందువులే అని, ఆ తరవాతే ఆ మతం నుంచి వేరే మతాలకు మారారని అని అన్నారు.
కాంగ్రెస్(Congress) మాజీ నేత, డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ(Democratic Azad Party) చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇస్లాం(Islam) మతం కన్నా హిందూ మతం(Hindu Religion) చాలా పురాతనమైందని, ముస్లింలంతా ఒకప్పుడు హిందువులే అని ఆయన అన్నారు. దేశంలోని పౌరులంతా ముందు హిందువులే అని, ఆ తరవాతే ఆ మతం నుంచి వేరే మతాలకు మారారని అని అన్నారు. దొడ జిల్లాలోని ఓ సమావేశానికి హాజరైన ఆజాద్.,ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం మతం 15 వందల ఏళ్ల క్రితం వచ్చిందని, అంతకు ముందు నుంచే హిందూ మతం ఉందని తెలిపారు. ఇదే సమయంలో కశ్మీరీ పండిట్‌ల గురించీ ప్రస్తావించారు.
15 వందల ఏళ్ల క్రితం ఇస్లాం మతం వెలుగులోకి వచ్చింది. కానీ హిందూ మతం మాత్రం అంతకు ముందు నుంచే ఉంది. కొందరు ముస్లింలు వలస వెళ్లారు. మొఘల్ సైన్యంలో చేరారు. క్రమంగా హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిపోయే వాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అంతర్గతంగానే ఈ మత మార్పిడి తీవ్రస్థాయిలో జరిగిందన్నారు ఆయన.
కశ్మీరీ పండిట్‌ల(Kashmir Pandit) గురించి మాట్లాడుతూ వాళ్లు కూడా పెద్ద ఎత్తున ఇస్లాం మతంలోకి మారిపోయారని చెప్పారు. ఆ కారణంగానే...ఇప్పుడు కశ్మీర్‌లో పండిట్‌ల సంఖ్య తగ్గిపోయిందని వెల్లడించారు. కాశ్మీర్ లో కాశ్మిరీ పండిట్లదే అధిక జనాభా అని, 600 ఏళ్ల క్రితం వరకు ఇదే పరిస్థితి కొనసాగిందని ఆజాద్ అన్నారు. కానీ వాళ్ళు క్రమంగా ఇస్లాం లోకి మారారని, వీళ్లందరి మూలాలు హిందూ మతంలోనే ఉన్నాయని ఆయన అన్నారు. హిందువులు, ముస్లింలు, రాజ్‌పూత్‌లు, బ్రాహ్మణులు, దళితులు, కశ్మీరీలు, గుజ్జర్‌లు...ఇలా పేరుకి వేరువేరుగా ఉన్నా అందరి మూలాలు ఒక్కటే. మన పూర్వీకులంతా ఇక్కడే ఉన్నారు అని ఆజాద్ చెప్పారు. మొఘల్ సైన్యం 10-12 మందితో ఇక్కడికి వచ్చిందని, ఆ తరవాతే మత మార్పిడి పెద్ద ఎత్తున జరిగిందని, ఇదే విషయాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్పాను అని ఆజాద్ సమావేశంలో అన్నారు.
గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన గులాం నబీ ఆజాద్, డెమోక్రాటిక్ ఆజాద్ పార్టీ స్థాపించారు. దాదాపు 5 దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పని చేసిన ఆజాద్ జమ్ముకశ్మీర్‌కి ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.కాంగ్రెస్ ను వీడినప్పటి నుంచి ఆజాద్ ప్రతీ సందర్భంలోను కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.