రాజస్థాన్‌లోని(Rajasthan) గిరిజనులు అధికంగా ఉండే బన్స్వారా-దుంగార్‌పూర్(Banswara-Dungarpur) లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం విచిత్రంగా సాగుతోంది . ఇక్కడ కాంగ్రెస్ తన సొంత అభ్యర్థికి ఓటు వేయవద్దని ఓటర్లను అభ్యర్థిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఎస్టీ రిజర్వ్‌డ్ అయిన బన్స్వారా-దుంగార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అరవింద్ దామోర్‌ను(Arvindh Damodhar) తన సొంత అభ్యర్థిగా నిలబెట్టింది.
రాజస్థాన్‌లోని(Rajasthan) గిరిజనులు అధికంగా ఉండే బన్స్వారా-దుంగార్‌పూర్(Banswara-Dungarpur) లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం విచిత్రంగా సాగుతోంది . ఇక్కడ కాంగ్రెస్ తన సొంత అభ్యర్థికి ఓటు వేయవద్దని ఓటర్లను అభ్యర్థిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఎస్టీ రిజర్వ్‌డ్ అయిన బన్స్వారా-దుంగార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అరవింద్ దామోర్‌ను(Arvindh Damodhar) తన సొంత అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే నామినేషన్ల(Nomination) ఉపసంహరణ చివరి తేదీకి ఒక రోజు ముందు భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ రోట్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. బీఏపీకి మద్దతివ్వాలని పార్టీ చేసిన ప్రకటనకు అనుగుణంగా దామర్ తన నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి ఉంది. కానీ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ముగిసే వరకు ఆయన ఎక్కడా కనిపించలేదు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన దామర్.. జరిగిన పరిణామాలేవీ తనకు తెలియనట్లు నటించి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో చేయి గుర్తుకు ఓటు వేయకూడదని కాంగ్రెస్ నేతలే చెప్పడం గమనార్హం