హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ స‌ర్కార్ సంక్షోభంలో కూరుకుపోయింది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ సీటును కోల్పోయే ప్ర‌మాదం ఉంది.

హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో కాంగ్రెస్(Congress) స‌ర్కార్ సంక్షోభంలో కూరుకుపోయింది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్(Sukhvinder Singh Sukhu) సీటును కోల్పోయే ప్ర‌మాదం ఉంది. దీంతో కాంగ్రెస్ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు సిద్ధ‌మైంది. అస‌లేమ‌య్యిందంటే.. హిమాచల్ ప్రదేశ్‌లోని రాజ్యసభ స్థానాలకు మంగళవారం (ఫిబ్రవరి 27) ఎన్నికలు జరిగాయి. దాని రిజల్ట్ అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్, కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీలకు సమాన ఓట్లు వచ్చాయి. అయితే.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నించింది. అసెంబ్లీలో బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ.. అంతిమంగా కాంగ్రెస్ ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రాస్ ఓటింగ్ తర్వాత బీజేపీ అభ్యర్థి ఓట్ల సంఖ్య 34కి పెరిగింది. రెండు పార్టీల సంఖ్య 34-34గా ఉంది. దీంతో స్లిప్పులు వేయ‌డంతో బీజేపీ అభ్యర్థి హర్షవర్ధన్ విజయం సాధించారు. ఈ విష‌య‌మై రాష్ట్ర రాజ‌కీయం ఒక్క‌సారిగా హీటెక్కింది.

తాజా ప‌రిణామం త‌ర్వాత హిమాచల్‌ ప్రదేశ్ ప్రతిపక్ష నేత జైరామ్‌ ఠాకూర్‌తో పాటు బీజేపీ శాసనసభా పక్షం గవర్నర్‌ను కలిసింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అనంతరం జైరాం ఠాకూర్ మాట్లాడుతూ.. కొంతకాలంగా అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్‌కు తెలియజేశాం.. రాజ్యసభ ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరాం. చూస్తుంటే కాంగ్రెస్‌కు అధికారంలో కొనసాగే అర్హత లేదు. కాంగ్రెస్‌ కష్టాల్లో ఉన్నది.. మా వల్ల కాదు.. వారి వల్లే అంటూ వ్యాఖ్య‌లు చేశారు.

తాజా ప‌రిణామాల‌పై కాంగ్రెస్ అధిష్టానం వెంట‌నే రియాక్ట్ అయ్యింది. హిమాచల్ ప్రదేశ్‌కు డీకే శివకుమార్, భూపేంద్ర సింగ్ హుడాలను కాంగ్రెస్ పరిశీలకులుగా నియమించింది. ఈ ఉదయం ఇరువురు నేతలు అక్క‌డికి చేరుకోనున్నారు.

Updated On 27 Feb 2024 10:14 PM GMT
Yagnik

Yagnik

Next Story