ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Assembly Election) తేదీలను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం(election Commission) ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్(congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) బీజేపీపై(BJP) మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం, ప్రగతిశీల అభివృద్ధే కాంగ్రెస్‌ పార్టీ హామీ అని ఖర్గే చెప్పారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Assembly Election) తేదీలను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం(election Commission) ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్(congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) బీజేపీపై(BJP) మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం, ప్రగతిశీల అభివృద్ధే కాంగ్రెస్‌ పార్టీ హామీ అని ఖర్గే చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన వెంటనే బీజేపీ, దాని మిత్రపక్షాల నిష్క్రమణ ఖరారైందని ఖర్గే అన్నారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలంతో ప్రజల్లోకి వెళ్లనుందని తెలిపారు.

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ దోటసార(Govind Singh Dotasara) అన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని.. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని అక్కడి ప్రజలు నిర్ణయించారన్నారు.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్(Kamal Nath) పార్టీ విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసే వారికి ఓటర్లు గుణపాఠం చెబుతారని అన్నారు. కొన్నేళ్లుగా మధ్యప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్న తేదీని ఈరోజు అధికారికంగా ప్రకటించార‌ని చెప్పారు. నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో పోలింగ్ జరగనుందని పేర్కొన్నారు.

సోమవారం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీల‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే రెండు దశలు పోలింగ్‌ ఉండగా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒక్కో దశలోనే పోలింగ్‌ ఉంటుంది. నవంబర్ 7 నుంచి నవంబర్ 30 మధ్య ఐదు రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 3న అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్ల‌డ‌వ‌నున్నాయి.

Updated On 9 Oct 2023 5:16 AM GMT
Ehatv

Ehatv

Next Story