కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం ఢిల్లీలో గెహ్లాట్, సచిన్ పైలట్‌లతో భేటీ కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం ఢిల్లీలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన ప్రత్యర్థి సచిన్ పైలట్‌తో వేర్వేరుగా సమావేశమవుతారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. గెహ్లాట్ ఢిల్లీ పర్యటనను ధృవీకరిస్తూ.. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యక్రమాల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) సోమవారం ఢిల్లీ(Delhi)లో గెహ్లాట్(Ashok Gehlot), సచిన్ పైలట్(Sachin Pilot)లతో భేటీ కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం ఢిల్లీలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన ప్రత్యర్థి సచిన్ పైలట్‌తో వేర్వేరుగా సమావేశమవుతారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. గెహ్లాట్(Gehlot) ఢిల్లీ పర్యటనను ధృవీకరిస్తూ.. ముఖ్యమంత్రి కార్యాలయం(CMO) కార్యక్రమాల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఈ నెలాఖరులోగా తన మూడు డిమాండ్ల(Demands)ను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతానని పైలట్ "అల్టిమేటం" ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాథాన్యత సంతరించుకుంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే(Vasundhara Raje) ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సచిన్ పైలట్ డిమాండ్ చేస్తున్నారు.
మే 26న రాష్ట్ర నాయకులతో కాంగ్రెస్ అగ్ర నేతల సమావేశం జరగాల్సి ఉంది. అయితే సమావేశం వాయిదా పడిందని సీనియర్ నాయకుడు తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు గెహ్లాట్, పైలట్‌లను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు హైకమాండ్ ప్రత్యేకంగా సమావేశమవుతుందని చెప్పారు. కర్ణాటక(Karnataka)లో సిద్ధరామయ్య(Siddaramaiah), డీకే శివకుమార్(DK Shivakumar)లను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఖర్గే విజయం సాధించారని, ఇప్పుడు రాజస్థాన్‌లోనూ అదే ఫార్ములాను ప్రయత్నించాలని పార్టీ భావిస్తోందని సీనియర్ నేత చెప్పారు. రాజస్థాన్(Rajasthan), మధ్యప్రదేశ్(Madhyapradesh), ఛత్తీస్‌గఢ్, తెలంగాణ(Telangana) సహా అన్ని రాష్ట్రాల నేతలతో కొద్దిరోజుల క్రితం జరగాల్సిన కాంగ్రెస్ హైకమాండ్(Congress HighCommand) సమావేశం కూడా వాయిదా పడిందని ఆయన చెప్పారు.