కాంగ్రెస్‌పార్టీలో(Congress) టికెట్లకు సంబంధించిన పంచాయితీ రకరకాల మలుపులు తిరుగుతోంది. ఒక పక్క అధికార బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ ఇప్పటికే మెజారిటీ స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా కేవలం నాలుగు చోట్ల మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మంత్రులు కేటీఆర్‌(KTR), హరీశ్‌రావులు(Harish Rao) విస్తృతంగా పర్యటిస్తున్నారు.

కాంగ్రెస్‌పార్టీలో(Congress) టికెట్లకు సంబంధించిన పంచాయితీ రకరకాల మలుపులు తిరుగుతోంది. ఒక పక్క అధికార బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ ఇప్పటికే మెజారిటీ స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా కేవలం నాలుగు చోట్ల మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మంత్రులు కేటీఆర్‌(KTR), హరీశ్‌రావులు(Harish Rao) విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ అలా ముందుకు వెళుతుంటే కాంగ్రెస్‌ పార్టీ ఇంకా అభ్యర్థుల ఎంపికలో తలమునకలుగా ఉంటోంది. కాంగ్రెస్‌లో బీసీల(BC) టికెట్ల సంగతేమిటి? ప్రతి పార్లమెంట్‌ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన మాట ప్రకారం 30కి పైగా సీట్లను బీసీలకు ఇస్తారా? ఇలాంటి సందేహాలు ఇప్పటికీ కాంగ్రెస్‌లో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే బీసీలకు 30కి పైగా సీట్లు కేటాయించే పరిస్థితి లేదని మనకున్న సమాచారం. 30 కాదు కదా 20 సీట్లు కూడా ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదట! అందుకే బీసీ నాయకులంతా ఢిల్లీకి వెళ్లి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు(Mallikarjuna Kharge) వాస్తవ పరిస్థితులు వివరించారు. బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే నష్టపోతామని చెప్పారు. మధుయాష్కీ లాంటి పెద్ద నాయకుడికే టికెట్ వస్తుందో రాదో అన్న పరిస్థితి నెలకొంది. సీనియర్‌ నాయకుల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఇదే సమయంలో మరి మా పరిస్థితి ఏమిటంటూ కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు ముందుకు వచ్చారు. గతంలో ఎప్పుడూ కమ్మ సామాజికవర్గం నేతలు ఇలా టికెట్ల కోసం వెంపర్లాడిన సందర్భాలు లేవు. తాము 15 నుంచి 17 నియోజకవర్గాలలో గణనీయంగా ఉన్నామని, 30 స్థానాలలో ఫలితాలను తారుమారు చేసే సత్తా తమకు ఉందని చెప్పుకుంటున్నారు. తమకు టికెట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్‌కే నష్టమని చెబుతున్నారు. ఢిల్లీకి కూడా వెళ్లారు. ముఖ్య నాయకులను కలుస్తున్నారు. ఈ గ్రూపుకు నాయకత్వం వహిస్తున్న రేణుకా చౌదరి తమ దగ్గర ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బి ఉన్నాయని, ఏ రకంగా టికెట్లు తెచ్చుకోవాలో తెలుసని వ్యాఖ్యానించారు. అసలు కమ్మ సామాజికవర్గం నేతలకు ఉన్న ప్లాన్లు ఏమిటి? ఏ విధంగా టికెట్లు తెచ్చుకోగలరు? అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం!

Updated On 9 Oct 2023 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story