ఎమ్మెల్సీ(MLC) అభ్యర్థులను కాంగ్రెస్‌(congress) అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్‌ఎస్‌యూ(NSU) నేతగా ఉన్న బల్మూరి వెంకట్(Balmuri)

ఎమ్మెల్సీ(MLC) అభ్యర్థులను కాంగ్రెస్‌(congress) అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్‌ఎస్‌యూ(NSU) నేతగా ఉన్న బల్మూరి వెంకట్(Balmoori venkat), పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌ గౌడ్‌(Mahesh Kumar Gowd) పేర్లను ఖరారు చేసింది. అద్దంకి దయాకర్‌కు(Addanki Dayakar) ఎమ్మెల్సీ ఇస్తారని గత రెండు, మూడు రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే ఆఖరి నిమిషంలో అద్దంకిని కాంగ్రెస్‌ అధిష్టానం మార్చింది. దీంతో అధిష్టానం నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. కాగా రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుంది. 29న రెండు స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ రెండు ఎమ్మెల్సీల పదవీకాలం 2027 నవంబర్ వరకు ఉంది.

Updated On 17 Jan 2024 6:01 AM GMT
Ehatv

Ehatv

Next Story