ఇండియా కూటమిలో(India alliance) భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్(Congress), ఆమ్ ఆద్మీ పార్టీల(Aam admi Party) మధ్య సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మూడు రాష్ట్రాలలో లోక్‌సభ ఎన్నికలకు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.
ఇండియా కూటమిలో(India alliance) భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్(Congress), ఆమ్ ఆద్మీ పార్టీల(Aam admi Party) మధ్య సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మూడు రాష్ట్రాలలో లోక్‌సభ ఎన్నికలకు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఢిల్లీ(Delhi), గుజరాత్(Gujarath), హర్యానారాష్ట్రాలో కలిసి పోటీ చేయనున్న కాంగ్రెస్-ఆప్. ఢల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. న్యూ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీలలో ఆప్ పోటీ చేస్తుంది. మిగిలిన మూడు స్థానాలు చాందిని చౌక్, ఈశాన్య ఢిల్లీ, వాయవ్య ఢిల్లీల నుంచి కాంగ్రెస్ బరిలో దిగుతుంది. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ 24లోక్‌సభ స్థానాలలో పోటీ చేస్తుంది. బరుచు, భావ్‌నగర్ లోక్‌సభ స్థానాలను ఆప్‌కు వదిలిపెట్టింది. హర్యానాలో ఉన్న మొత్తం పది లోక్‌సభ స్థానాల్లో తొమ్మిదింట కాంగ్రెస్ పోటీ చేస్తుంటే, కురుక్షేత్ర నుంచి ఆప్ బరిలో దిగుతుంది. గోవా, పంజాబ్‌లలో మాత్ర ఒంటరిగానే పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి.