కాంగ్రెస్‌ రెండో లిస్ట్(Congress Second List) విడుదలైంది. రెండు విడతల్లో కలిపి 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి విడత జాబితాలో 55 మందికి, రెండో జాబితాలో 45 మందికి టికెట్లు కేటాయించారు. అయితే తొలి విడత, రెండో విడత జాబితాపై పలు చోట్ల నిరసనలు వచ్చాయి. పలువురు నాయకులు పార్టీని వీడారు. పలువురు నేతలు అసంతృప్తిగానే పార్టీలో   కొనసాగుతున్నారు. ఇంకా మరో 19 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.

కాంగ్రెస్‌ రెండో లిస్ట్(Congress Second List) విడుదలైంది. రెండు విడతల్లో కలిపి 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి విడత జాబితాలో 55 మందికి, రెండో జాబితాలో 45 మందికి టికెట్లు కేటాయించారు. అయితే తొలి విడత, రెండో విడత జాబితాపై పలు చోట్ల నిరసనలు వచ్చాయి. పలువురు నాయకులు పార్టీని వీడారు. పలువురు నేతలు అసంతృప్తిగానే పార్టీలో కొనసాగుతున్నారు. ఇంకా మరో 19 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.

ఆ 19 స్థానాల్లో నాలుగు సీట్లు వామపక్షాలకు కేటాయించే అవకాశం ఉంది. చెన్నూరు, కొత్తగూడెం సీపీఐకి, మిర్యాలగూడ, వైరా స్థానాలు పొత్తులో భాగంగా వామపక్ష పార్టీలకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పొత్తులపై కూడా ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మిగిలిన 15 స్థానాల్లో ఆశావహులు ఎక్కువ ఉండడంతో కాంగ్రెస్‌ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని సీట్లపై రేవంత్(Revanth Reddy) చేతులెత్తేసినట్లు తెలిసింది. అధిష్టానమే అభ్యర్థులను ఖరారు చేయాలని చెప్పినట్లు తెలిసింది. సూర్యాపేటలో(Suryapet) దామోదర్‌రెడ్డి(Damodar Reddy), పటేల్‌ రమేష్‌రెడ్డి(Patel Ramesh Reddy) మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

తనను విజయం రెండు సార్లు దోబూచులాడిందని, ఈ సారి తుంగతుర్తి నుంచి ఎలాగైనా గెలుస్తానని టికెట్ నాకే ఇవ్వాలని అద్దంకి దయాకర్‌(Addanki Dhayakar) పట్టుబడుతున్నారు. ఇదే స్థానం నుంచి వడ్డేపల్లి రవి(Vaddepalli Ravi), మోత్కుపల్లి కూడా టికెట్ ఆశిస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ స్థానాన్ని ధర్మపురి సంజయ్(Dharmapuri sanjay), మహేష్‌కుమార్(Mahesh kumar), షబ్బీర్‌ అలీ(Shabbir Ali) ఆశిస్తున్నట్లుగా సమాచారం. బాన్సువాడను ఆశిస్తున్నవారిలో కాసుల బాలరాజు(Kasula balaraju), ఏనుగు రవీందర్‌రెడ్డి(Enugu Ravinder Reddy) ఉన్నారు. జుక్కల్‌ నుంచి గంగారం(Gangaram), లక్ష్మీకాంతరావు(Lakshmikantha Rao) సీటును ఆశిస్తున్నారు.

పటాన్‌చెరు టికెట్‌పై చిక్కుముడి వీడలేదు. ఇక్కడి నుంచి శ్రీనివాస్‌గౌడ్(Srinivas Goud), నీలం మధు(Neelam Madhu) టికెట్ ఆశిస్తున్నారు. కరీంనగర్‌ నుంచి సంతోష్‌కుమార్, పురుమల్ల శ్రీనివాస్‌ టికెట్ కోరుకుంటున్నారు. ఇల్లందులో కోరం కనకయ్య, శంకర్‌నాయక్‌ టికెట్ ఆశిస్తున్నారు. డోర్నకల్‌ టికెట్‌ తనదేనంటూ రామచంద్రనాయక్‌(Ramchandra Naik) చెప్తున్నారు. సత్తుపల్లి నుంచి రాగమయి, విద్యార్థి నాయకుడు మానవతారాయ్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. నారాయణఖేడ్‌లో సురేష్‌ షెట్కర్, సంజీవరెడ్డి, అశ్వరావుపేటలో తాటి వెంకటేశ్వర్లు, ఆదినారాయణ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు.
ఈ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
అయితే కామారెడ్డి నుంచి రేవంత్‌, సిరిసిల్ల నుంచి ఉత్తమ్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌పై రేవంత్, కేటీఆర్‌పై ఉత్తమ్‌, గజ్వేల్‌లో ఈటల పోటీ చేస్తే... ఈ మూడు స్థానాలపై రాష్ట్రమే కాదు, దేశం దృష్టి కూడా పడే అవకాశం ఉంది.

Updated On 28 Oct 2023 3:03 AM GMT
Ehatv

Ehatv

Next Story