కేరళలోని వాయనాడ్‌, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ పార్టీ ఫండ్ నుంచి రూ.1 కోటి 40 లక్షలు అందుకున్నారు

కేరళలోని వాయనాడ్‌, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ పార్టీ ఫండ్ నుంచి రూ.1 కోటి 40 లక్షలు అందుకున్నారు. రెండు చోట్ల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ 70-70 లక్షల రూపాయలను ఇచ్చింది. ఈ వివరాలను ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ సమర్పించింది. విక్రమాదిత్య సింగ్‌కు పార్టీ అత్యధిక నిధులు ఇచ్చింది. మండి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు రూ.87 లక్షలు ఇచ్చారు. అయితే బీజేపీ అభ్యర్థి, నటి కంగనా రనౌత్ పై విక్రమాదిత్య ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

అమేథీ లోక్‌సభ స్థానంలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్ శర్మ కూడా ఆ పార్టీ నుంచి రూ.70 లక్షలు అందుకున్నారు. దీంతో పాటు కేరళలోని అలప్పుజా నుంచి కేసీ వేణుగోపాల్, తమిళనాడులోని విరుదునగర్ నుంచి మాణికం ఠాగూర్, కర్ణాటకలోని గుల్బర్గా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాధాకృష్ణ, పంజాబ్‌లోని శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ ఇందర్ సింగ్లా కూడా రూ.70 లక్షలు చొప్పున అందుకున్నారు.

ఆనంద్ శర్మ రూ.46 లక్షలు, దిగ్విజయ్ సింగ్ రూ.50 లక్షలు అందుకున్నారు. అయితే ఇద్దరు నేతలూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్‌బరేలీ రెండు స్థానాల నుండి ఎన్నికల్లో గెలుపొందారు. అయితే, ఆ తర్వాత ఆయన వాయనాడ్ సీటును వదులుకున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికలు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ గత నెలలో ఎన్నికల కమిషన్‌కు తన 'పాక్షిక ఎన్నికల వ్యయ ప్రకటన' సమర్పించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ ఇచ్చిన 'మొత్తానికి' సంబంధించిన వివరాలు పేర్కొంది.

ఒక అభ్యర్థి ఎన్నికలలో పరిమితి వరకు మాత్రమే ఖర్చు చేయవచ్చు. అయితే రాజకీయ పార్టీలకు సంబంధించి అలాంటి నిబంధనేమీ లేదు. ఒక అభ్యర్థి లోక్‌సభ ఎన్నికల్లో రూ.95 లక్షలు, అసెంబ్లీ ఎన్నికల్లో రూ.40 లక్షల వరకు ఖ‌ర్చు చేయోచ్చు. అయితే.. కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిమితి భిన్నంగా ఉంటుంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story