కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో(Karnatak RTC) మహిళలకు ఉచితమే! అలాగని పిట్టల్ని, బుట్టల్నీ వెంటేసుకుని బస్సు ఎక్కితే కుదరదు కదా! ఇట్టాగే ఓ మహిళా ప్రయాణికురాలు బస్సులో తన వెంట చిలుకలను తీసుకెళ్లింది. అది చూసిన కండక్టర్ వాటికి 444 రూపాయల టికెట్ కొట్టాడు. అది చూసి పాపం ఆ మహిళే కాదు, తోటి ప్రయాణికులు కూడా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో(Karnatak RTC) మహిళలకు ఉచితమే! అలాగని పిట్టల్ని, బుట్టల్నీ వెంటేసుకుని బస్సు ఎక్కితే కుదరదు కదా! ఇట్టాగే ఓ మహిళా ప్రయాణికురాలు బస్సులో తన వెంట చిలుకలను తీసుకెళ్లింది. అది చూసిన కండక్టర్ వాటికి 444 రూపాయల టికెట్ కొట్టాడు. అది చూసి పాపం ఆ మహిళే కాదు, తోటి ప్రయాణికులు కూడా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం ఉదయం ఓ మహిళ బెంగళూరు(Bangalore) నుంచి మైసూర్‌కు(Mysore) కర్ణాకట ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది. ఆ సమయంలో మనవరాలితోపాటు నాలుగు చిలుకలున్న పంజరాన్ని తన వెంట తీసుకుని వెళుతోంది. ఆ మహిళకు, ఆమె మనవరాలికి కండక్టర్ ఉచిత టికెట్ ఇచ్చాడు. నాలుగు చిలుకలకు(Birds) మాత్రం టికెట్ కొట్టారు. ఒక్కో చిలుకకు 111 రూపాయల చొప్పున నాలుగింటికి 444 రూపాయలు ఇవ్వాలన్నాడు. కండక్టర్ మాట విని ఆ మహిళ బిత్తరపోయింది. కండక్టర్‌ను నిలదీసింది. నిబంధనల ప్రకారమే టికెట్ కొట్టానని కండక్టర్ చెప్పాడు. కర్ణాటక ఆర్టీసీ రూల్స్‌లలో ప్రయాణికులు తమతో తీసుకెళ్లే జంతువులకు, పక్షులకు సగం టికెట్ ధర చెల్లించాలని ఉంది. అలా టికెట్ తీసుకోకపోతే ప్రయాణికులకు ప్రయాణ టికెట్ ధరలో పది శాతం జరిమానా విధిస్తారు. అంటే చిలుకలను బాలలుగా పరిగణిస్తూ కండక్టర్ టికెట్ కొట్టాడన్నమాట! అంచేత కండక్టర్ చేసినదాంట్లో తప్పేమీ లేదన్నమాట!