కర్ణాటకలో(karnataka) తుమ్కురు(Thumkura) జిల్లా కొరటగెరె తాలూకా గొరవణహళ్లిలోని (Goravanahalli) మహాలక్ష్మి క్షేత్రం(Mahalakshmi Kshetra) మహిమాన్వితం. ఇక్కడ ఆ అమ్మవారు అభీష్టసిద్ధి వరప్రదాయినిగా పూజలందుకుంటోంది.. అయిదువందల సంవత్సరాల కిందట నిర్మించిన ఈ ప్రాచీన ఆలయాన్ని కమలమ్మ అనే భక్తురాలు జీర్ణోద్ధరణ చేసిందట!
కర్ణాటకలో(karnataka) తుమ్కురు(Thumkura) జిల్లా కొరటగెరె తాలూకా గొరవణహళ్లిలోని (Goravanahalli) మహాలక్ష్మి క్షేత్రం(Mahalakshmi Kshetra) మహిమాన్వితం. ఇక్కడ ఆ అమ్మవారు అభీష్టసిద్ధి వరప్రదాయినిగా పూజలందుకుంటోంది.. అయిదువందల సంవత్సరాల కిందట నిర్మించిన ఈ ప్రాచీన ఆలయాన్ని కమలమ్మ అనే భక్తురాలు జీర్ణోద్ధరణ చేసిందట! దేశంలో ఉన్న అతిపెద్ద మహాలక్ష్మి ఆలయాల్లో ఇది కూడా ఒకటి! రమణీయమైన ప్రకృతి సోయగాల మధ్యన ఈ క్షేత్రం ఉంది. లక్ష్మీదేవి ఆలయానికి కుడివైపున అమ్మవారి ఉత్సవమూర్తి ఉంది.
ఈ ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులు ముందు ఈ ఉత్సవమూర్తికి పూజలు చేస్తారు. అటు పిమ్మట గర్భాలయంలో కొలువుతీరిన శ్రీమహాలక్ష్మి అమ్మవారి దివ్యమంగళరూపాన్ని చూసి భక్తులు అలౌకికమైన ఆనందానికి లోనవుతారు. స్వర్ణమయంగా ఉన్న అమ్మవారి మూర్తి కాంతులీనుతూ ఉంటుంది. లక్ష్మీదేవి(Lakshmi Devi) వెనుక భాగంలో శిలపై అమ్మవారి మూలమూర్తి దర్శనమిస్తుంది. గొరవణహళ్లి మహాలక్ష్మి దర్శనంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
అమ్మవారిని భక్తితో పూజించి సేవిస్తే సమస్త బాధలు తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం. అమ్మవారికి చేసే కుంకుమపూజ విశేష ఫలితాన్ని ఇస్తుంది.. అమ్మవారి దర్శనం అంత మహిమాన్వితమైనది కాబట్టే ఈ ఆలయాన్ని రోజూ వేలాది మంది దర్శించుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మారికాంబ అమ్మవారి గుడి కూడా ఉంది.
మారికాంబ అంటే గొరవణహళ్లి గ్రామదేవత! ఈ గుడికి వచ్చే భక్తులు మహాలక్ష్మితో పాటు మారికాంబ అమ్మవారిని కూడా దర్శించుకుని వెళతారు. ఈ మందిర ప్రాంగణంలోనే ఆంజనేయస్వామి, నవగ్రహాలు, వినాయకుడి గుడి ఉన్నాయి. ఈ గుడిని సందర్శించే యాత్రికుల కోసం దేవస్థానం సకల సదుపాయాలు చేసింది. వసతి భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి. మొత్తంగా అమ్మవారి దర్శనం సర్వమంగళకరం. ఓ అపురూప ఆధ్యాత్మిక ఆనందాన్ని సొంతం చేసే దివ్య క్షేత్రం.