ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా న్యాయ, గిరిజన, సామాజిక, హోంశాఖ కార్యదర్శులు ఉన్నారు.

Prime Minister Modi
ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కీలక నిర్ణయం(Center key decision) తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ(SC Categorization)పై ఐదుగురు సభ్యులతో కమిటీ(Five members Committee ) ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి (Cabinet Secretary) రాజీవ్ గౌబ (Rajeev Gauba) ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా న్యాయ, గిరిజన, సామాజిక, హోంశాఖ కార్యదర్శులు ఉన్నారు. ఈ నెల 22న ఈ కమిటీ తొలి సమావేశం జరుగనుంది. ఎస్పీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఎన్నికల్లో ప్రధాని మోదీ( Prime Minister Modi) హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు కమిటీ ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీం నిర్ణయం నేపథ్యంలో కేంద్రం కమిటీ వేయడం ప్రధాన్యత ఏర్పడింది.
