ప్రభుత్వ చమురు కంపెనీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ ధరను రూ.100 పెంచాయి. గత రెండు నెలల్లో రెండోసారి కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి.
ప్రభుత్వ చమురు కంపెనీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ(Commercial LPG Cylinder) ధరను రూ.100 పెంచాయి. గత రెండు నెలల్లో రెండోసారి కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. అక్టోబర్(October)లో కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ ధరను రూ.209 పెంచాయి. ఈ పెంపు కారణంగా ఎల్‌పీజీ సిలిండర్ల ధర రూ.1731.50కి చేరింది.
కొత్త ధరల పెరుగుదల తర్వాత ఢిల్లీ(Delhi)లో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,731 నుండి రూ.1,833కి పెరిగింది. అక్టోబర్‌లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర ముంబై(Mumbai)లో రూ.1,684 ఉండగా.. ప్రస్తుతం రూ.1,785.50గా ఉంది, కోల్‌కతా(Kolkata)లో గత నెలలో రూ.1,839.50 ఉండగా.. పెరిగిన ధరతో రూ.1,943గా ఉంది. చెన్నై(Chennai)లో అక్టోబర్‌లో రూ.1,898 ఉండగా.. ప్రస్తుతం రూ.1999.50గా ఉంది.
సెప్టెంబర్(September) 1న చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.158 తగ్గించాయి. దీని తర్వాత ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,522కి తగ్గింది. ఆగస్టు(August) ప్రారంభంలో కూడా చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.99.75 తగ్గించాయి. ఆ తర్వాత గడిచిన రెండు నెలలుగా కంపెనీలు రెండుసార్లు ధరలను పెంచాయి.