గత కొన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ల ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి. గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి తగ్గాయి. అయితే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు మాత్రమే తగ్గాయి. 14.2 కిలోల దేశీయ వంటగ్యాస్ ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. తాజా తగ్గింపుతో అనేక నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు మారాయి.
గత కొన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ల(Cylinder) ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటున్నాయి. గ్యాస్ సిలిండర్ల ధరలు(Gas Cylinder Prices) మరోసారి తగ్గాయి. అయితే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల(Commercial LPG cylinder) ధరలు మాత్రమే తగ్గాయి. 14.2 కిలోల దేశీయ వంటగ్యాస్ ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. తాజా తగ్గింపుతో అనేక నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు మారాయి. నివేదికల ప్రకారం.. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 171.50 రూపాయలు తగ్గింది. ఈ తగ్గింపు తర్వాత ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్(Commercial Cylinder) ధర రూ.1856.50కు చేరింది.
దేశంలోని గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ల ధరలను నిర్ణయిస్తాయి. ఈ మేరకు చమురు కంపెనీలు తమ వెబ్‌సైట్‌లో కొత్త ధరలను అప్‌డేట్ చేశాయి. ఢిల్లీ(Delhi)లో వాణిజ్య సిలిండర్ రూ. 1856.50గా మారింది. కోల్‌కతా(Kolkata)లో రూ. 1960.50, ముంబై(Mumbai)లో రూ. 1808.50, చెన్నై(Chennai)లో రూ. 2021.50గా ఉన్నాయి. పెట్రోలియం. చమురు కంపెనీలు ఈ ఏడాది మార్చిలో కమర్షియల్ సిలిండర్ ధరను యూనిట్‌కు రూ.350.50 పెంచగా, డొమెస్టిక్ సిలిండర్ ధరను యూనిట్‌కు రూ.50 చొప్పున పెంచాయి. ఏప్రిల్ 1న కూడా ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.92 తగ్గింది.