ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాసి (Varanasi) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు, కమెడియన్‌ శ్యామ్‌ రంగీలా (Comedian Shyam Rangeela)ఆశాభంగం జరిగింది. ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే నామినేషన్ పత్రాలు తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాసి (Varanasi) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్న ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు, కమెడియన్‌ శ్యామ్‌ రంగీలా (Comedian Shyam Rangeela)ఆశాభంగం జరిగింది. ఆయన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే నామినేషన్ పత్రాలు తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు. రాజస్తాన్‌కు శ్యామ్‌ రంగీలా మంచి మిమిక్రీ కళాకారుడు. ప్రధాని మోదీ గొంతును అనుకరించడం వల్ల సోషల్ మీడియాలో బాగా పాపులరయ్యాడు. మోదీపై ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దామనుకున్నారు కానీ నామినేషన్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మొదట మే 10వ తేదీ, 13వ తేదీలలో నామినేషన్‌ వేయడానికి ప్రయత్నించాడు శ్యామ్‌ రంగీలా. అతడి పత్రాలను ఎవరూ స్వీకరించలేదు. ఇక చివరి రోజైన మే 14వ తేదీన నామినేషన్ వేయడానికి వెళితే అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తీవ్ర ప్రయత్నాల తర్వాత చివరకు నామినేషన్ల ముగింపు గడువుకు రెండు నిమిషాల ముందు మధ్యాహ్నం 2.58 గంటలకు నామినేషన్ వేశాడు శ్యామ్‌ రంగీలా. అయితే మర్నాడు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి శ్యామ్‌ రంగీలా పత్రాలను తిరస్కరించారు. నామినేషన్‌ సంపూర్ణంగా లేదని, అఫిడవిట్‌పై ప్రమాణం చేయలేదని అధికారులు తెలిపారు. అయితే అధికారుల తీరును శ్యామ్‌ రంగీలా తప్పుబట్టారు. కావాలనే తన పత్రాలను తిరస్కరించారని ఆరోపించారు.

Updated On 16 May 2024 3:00 AM GMT
Ehatv

Ehatv

Next Story