మిమిక్రి ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా (Shyam Rangeela) పాలిటిక్స్‌లో ఎంటరయ్యాడు. వారణాసి (Waranasi) నుంచి పోటీకి సిద్ధమయ్యాడు. ప్రధాని నరేంద్రమోదీని (PM Narendra Modi) అనుకరించే రంగీలా ఇప్పుడు ఆయన మీదే పోటీకి దిగుతుండటం విశేషం.
మిమిక్రి ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా (Shyam Rangeela) పాలిటిక్స్‌లో ఎంటరయ్యాడు. వారణాసి (Waranasi) నుంచి పోటీకి సిద్ధమయ్యాడు. ప్రధాని నరేంద్రమోదీని (PM Narendra Modi) అనుకరించే రంగీలా ఇప్పుడు ఆయన మీదే పోటీకి దిగుతుండటం విశేషం. తాను మనస్ఫూర్తిగా ఎన్నికల బరిలో దిగుతున్నానని, నామినేషన్ వేయడానికి వచ్చేవారం వారణాసికి వెళుతున్నానని 29 ఏళ్ల శ్యామ్ రంగీలా చెప్పారు. సూరత్, ఇండోర్ లోక్‌సభ స్థానాల్లో మాదిరిగా కాకుండా వారణాసి పౌరులకు ఓటు వేసే అవకాశం కల్పిస్తానని, ఒకవేళ అభ్యర్థులందరూ నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నా తాను మాత్రం బరిలో ఉంటానని చెప్పాడు. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి లేదని, ఎప్పుడైనా నామినేషన్ ఉపసంహరించుకుంటారని అన్నారు. నరేంద్రమోదీని అనుకరిస్తూ పాపులారిటీ సంపాధించిన శ్యామ్ రంగీలా తన మద్దతుదారుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను వారణాసిలో పోటీ చేస్తానని ప్రకటించటంతో వచ్చిన స్పందనకు చాలా సంతోషంగా ఉందని, తన వీడియోల ద్వారా నామినేషన్‌కు సంబంధించిన విషయాలు పంచుకుంటానని అన్నాడు. 2014లో తాను ప్రధాని మోదీ ఫాలోవర్‌నని, మోదీకి మద్దతుగా వీడియోలు చేశానని, అదే విధంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వీడియోలు షేర్ చేశానని చెప్పాడు. 'అప్పుడు మరో 70 ఏళ్లు బీజేపీ ఓటు వేస్తాననుకున్నా. కానీ, గత పదేళ్లలో పరిస్థితులు మారిపోయాయి' అని కమెడియన్ శ్యామ్ రంగీలా తెలిపారు. నిజానికి తాను ఓ ఫకీర్‌నని, తన దగ్గర ఏమీ లేదని, బ్యాగ్‌తో వచ్చి దానితోనే వెళ్లిపోతానని, కాబట్టి తనకు ఈడీ దాడుల భయం లేదని తెలిపారు. కాగా, కాంగ్రెస్ నుంచి అజయ్‌రాయ్ పోటీ చేస్తున్నారు. గత రెండు లోక్‌సభ ఎన్నికలలో కూడా ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి మోదీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.