ఈ కాలంలో పెళ్లిళ్లు చేసుకోవాలనుకున్నవారు చాలా మంది మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లను(Matrimony websites) ఆశ్రయిస్తున్నారు. కొందరికి ఈ వెబ్‌సైట్లు చక్కటి పెళ్లి సంబంధాలు సెట్‌ చేస్తుండగా వీటిని అడ్డుపెట్టుకొని మోసగాళ్లు బయల్దేరారు. మంచి మంచి ప్రొఫైల్స్, ఆకర్షణీయ ఫొటోలు జోడించి ఎదుటివారిని ఆకట్టుకుంటున్నారు. ఇందులో నుంచే ఓ ప్రబుద్దుడు బయల్దేరాదు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 250 మందికి వల వేసి వారితో శృంగారాన్ని ఎంజాయ్‌ చేశాడు. అంతేకాకుండా వారి నుంచి అందినకాడికి దోచుకున్నాడు.

నరేష్‌(Naresh) అనే ఒక వ్యక్తి 25 ఏళ్ల క్రితం నాటి ఫొటోను మ్యాట్రిమోనీ వెబ్‌ సైట్‌లో పోస్టు చేశాడు. నరేష్‌ పూరి గోస్వామి అలియాస్‌ నరేష్‌ అనే వ్యక్తి మ్యాట్రిమోనీ వెబ్‌ సైట్‌లో ప్రొఫైల్‌ పెట్టాడు. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారిగా ప్రొఫైల్‌లో వివరాలు పొందుపర్చాడు. సాధారణంగా కాస్త హైప్రొఫైల్‌, ఆకట్టుకునే రూపం ఉంటే యువతులు, మహిళలు ఆకర్షితులవుతారు. అందులో ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారి అని చెప్పడంతో ఆ ప్రొఫైల్‌కే మొగ్గు చూపుతారు. భర్తను కోల్పోయయిన మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్‌ చేశాడు. ఇలా 250 మంది మహిళలు, యువతులకు వల వేశాడు. వారిని పెళ్లాడతానని నమ్మించాడు. వారితో సెక్స్‌లో కూడా పాల్గొన్నాడు.

పాపాలు ఏదో ఒక రోజు బయట పడక తప్పవు కదా.. తమిళనాడులోని(Tamilnadu) కోయంబత్తూరుకు(Coimbatore) చెందిన మహిళను లోబర్చుకునేందుకు ఇదే ప్లాన్‌ వేశాడు. పెళ్లి విషయం మాట్లాడాలని నరేష్‌ కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు మహిళను పిలిపించాడు. ఆ తర్వాత టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకోవాలని, డబ్బులు తరువాత ఇస్తానని, తన పర్స్‌ ఇంట్లోనే మరిచిపోయి వచ్చానని మాయమాటలు చెప్పాడు. దీంతో ఆ మహిళలకు డౌటానుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నరేష్‌ను బెంగళూరు సిటీ పోలీసులు రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేశారు. నిందితుడు రెండు సిమ్‌ కార్డులు కొనుక్కొని వాటిని వాడుతున్నాడని పోలీసులు వెల్లడించాడు. దినపత్రికల్లో పెళ్లి చేసుకోవడానికి ప్రకటనలు ఇచ్చిన మహిళలను గుర్తించి వారి ఫోన్‌ నెంబర్లు సేకరించి వారికి ఫోన్లు చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికేవాడు. ఇలా ఈ మాహానటుడి బారిన పడ్డ వారు వందల్లో ఉన్నారంటే ఆశ్చర్యపోక మానరు. రాజస్థాన్‌కు చెందిన 56 మంది, ఉత్తరప్రదేశ్‌ కు చెందిన 32 మంది, ఢిల్లీకి చెందిన 32 మంది, కర్నాటకు చెందిన 17 మంది, మధ్యప్రదేశ్‌కు చెందిన 16 మంది, మహారాష్ట్రకు చెందిన 13 మంది, గుజరాత్‌కు చెందిన 11 మంది మహిళలు ఇతగాడి చేతిలో మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇతని బారిన పడ్డ ఇంకా ఎంతో మంది మహిళలు తమ గురించి బయటకు పొక్కుతుందన్న భయంతో ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని పోలీసులు తెలిపారు.

Updated On 29 Feb 2024 2:10 AM GMT
Ehatv

Ehatv

Next Story