'ది కేరళ స్టోరీ'(The Kerala Story) చిత్రానికి యూపీ(UP)లో పన్ను మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) ట్వీట్ చేశారు. అలాగే సీఎం యోగి మే 12న క్యాబినెట్‌తో కలిసి సినిమా చూడనున్నారు. యువతులను ప్రలోభపెట్టి మత మార్పిడి చేయడమే ఈ సినిమా కథ.

'ది కేరళ స్టోరీ' చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్(Sudipto Sen). షాలిని, నీమ, గీతాంజలి అనే ముగ్గురు అమ్మాయిలు నర్సులు కావాలనే కలతో ఇంటికి దూరంగా ఉన్న కాలేజీకి వచ్చి అక్కడ ఆసిఫాను కలుసుకుంటారు. అసిఫా ఫండమెంటలిస్ట్. కథ ముందుకు సాగుతున్న క్రమంలో అసిఫా ఆ ముగ్గురు అమ్మాయిలను ఐస్ఐఎస్‌కు పంపడానికి పని చేస్తుందని తెలుస్తుంది. ఆసిఫా తన సహచరుల సహాయంతో ముగ్గురు అమ్మాయిలను బ్రెయిన్ వాష్ చేసి మతం మారేలా ఎలా ప్రేరేపిస్తుందో ఈ చిత్రంలో చూపించారు.
ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కేరళ సీఎం పినరయి విజయన్(Pinarayi Vijayan) చిత్ర విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బెంగాల్ లో సినిమాపై పూర్తి నిషేదం విధించగా.. తమిళనాడులో మల్టీప్లెక్స్ షో లను రద్దు చేశారు.