తమిళనాడులో(Tamilnadu) రోజురోజుకు అక్కడి గవర్నర్(Governor), ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. 2021లో ఆర్.ఎన్.రవిని(RN Ravi) తమిళనాడు గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు. అప్పటి నుంచి గవర్నర్, అక్కడి ప్రభుత్వం మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
తమిళనాడులో(Tamilnadu) రోజురోజుకు అక్కడి గవర్నర్(Governor), ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. 2021లో ఆర్.ఎన్.రవిని(RN Ravi) తమిళనాడు గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు. అప్పటి నుంచి గవర్నర్, అక్కడి ప్రభుత్వం మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గవర్నర్ ఆర్.ఎన్.రవిపై సీఎం స్టాలిన్(CM Stalin) బాహాటంగానే విమర్శలు గుప్పించారు. తన ప్రభుత్వాన్ని కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు.
తాజాగా గవర్నర్‌పై సుప్రీంకోర్టుకు(Supreme court) వెళ్లింది స్టాలిన్ సర్కార్. అసెంబ్లీలో తీర్మానం చేసి పాస్ చేసిన బిల్లులను తొక్కిపట్టారని సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం రిట్ పిటిషన్(WRIT Petition) వేసింది. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను గవర్నర్ తన వద్దే ఉంచుకొని, ఆమోదం తెలపడం లేదని ఆ పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వ బిల్లులను వెంటనే ఆమోదించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం కోరింది.గత కొంత కాలంగా స్టాలిన్ సర్కార్‌కు, గవర్నర్‌కు మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్న విషయం తెల్సిందే.
ప్రతిపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో తమకు నచ్చిన వ్యక్తులను గవర్నర్లుగా నియమించుకొని ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేంద్రంపై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లోనూ ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలోనూ గవర్నర్ పలు బిల్లులను ఆమోదించడం లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎన్నో బిల్లులు ఇంకా తెలంగాణ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష ప్రభుత్వాలపై కక్ష సాధిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ గవర్నర్ల వ్యవస్థనే తీసేయాలని కొన్ని ప్రతిపక్షాలు కూడా కోరుతుండడం గమనార్హం.