మ‌ధ్య‌ప్ర‌దేశ్‌(Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) ముందు శివరాజ్ సింగ్(Shivaraj Singh) నేతృత్వంలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. గవర్నర్ మంగుభాయ్ పటేల్‌తో(Mangubhai Patel) భేటీ అనంతరం శనివారం ఉదయం 8.45 గంటలకు ముగ్గురు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

గవర్నర్ మంగూభాయ్ పటేల్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గ విస్తరణ కోసం ఈ ఉద‌యం ఒకే వేదికపైకి చేరుకున్నారు. వేదికపై నూత‌న మంత్రులు గౌరీశంకర్ బిసెన్(Gowrishankar Bisen), రాహుల్ లోధి(Rahul Lodhi), రాజేంద్ర శుక్లా(Rajendra Shukla) కూడా ఉన్నారు. జాతీయ గీతాలాపన అనంతరం గవర్నర్‌ పటేల్‌ ముగ్గురితో ప్రమాణం చేయించారు. మహాకౌశల్‌ నుంచి గౌరీశంకర్‌ బిసెన్‌, వింధ్య నుంచి రాజేంద్ర శుక్లా, బుందేల్‌ఖండ్‌ నుంచి రాహుల్‌ లోధి గెలుపొందారు. ముగ్గురి ప్ర‌మాణ‌స్వీకారంతో శివరాజ్ మంత్రివర్గంలో ఇప్పుడు 33 మంది మంత్రులు ఉన్నారు. 1 పోస్ట్ ఇప్పటికీ ఖాళీగా ఉంది.

శివరాజ్ మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ కమల్ నాథ్ విమర్శలు గుప్పించారు. పదవీ కాలం ముగిసి.. ప్రభుత్వం పడిపోనుంద‌ని.. ఇప్పుడు ఎంపీలో మంత్రివర్గ విస్తరణ జరుగుతోందని ట్వీట్‌ చేశారు. వీడ్కోలు సమయంలో స్వాగత గీతం పాడిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మంత్రివర్గాన్ని విస్తరించినా.. మార్చినా ఓడిపోవడం ఖాయం అని అన్నారు.

Updated On 26 Aug 2023 12:44 AM GMT
Ehatv

Ehatv

Next Story