తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) ఎప్పటిలాగే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) ఎప్పటిలాగే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్‌(Congress) అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్‌ పెద్దలతో రేవంత్‌ చర్చించనున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం తెల్లవారు జామునే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్(Bhatti vikramarka) ఢిల్లీకి(delhi) బయలుదేరారు. ఢిల్లీలో రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(mallikarjun kharge), సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్‌గాంధీతో(Rahul gandhi) సమావేశం అయ్యే ఛాన్సు ఉంది. నూతన పీసీపీ చీఫ్‌, కేబినెట్‌ విస్తరణ, రైతులకు రుణమాఫీ చేసిన అంశాన్ని రాహుల్‌ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించే అవకాశం ఉంది. ఇదలా ఉంచితే తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవి కోసం చాలా మంది పోటీపడుతున్నారు. ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణకు చెందిన వారికే పీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వాలనే చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారట! ఇక ముఖ్యమంత్రి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కనుక పీసీసీ పదవి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గ నేతలకు ఇవ్వాలనిచాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ సామాజికవర్గం నుండి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్(Adluri laxman), ఎస్టీ సామాజిక వర్గం నుండి బలరాం నాయక్(balaram nayak), బీసీ సామాజిక వర్గం నుండి మధు యాష్కీ(Madhu yashki) పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

మంత్రి వర్గ విస్తరణపై కూడా పెద్దలతో రేవంత్‌ ముచ్చటించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో పాటు ఇప్పుడున్న 12 మంది మంత్రులకు అదనంగా మరో నలుగురిని మంత్రి మండలిలో తీసుకునే అవకాశం ఉంది. సుదర్శన్‌ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమసాగర్‌ రావు, మదన్ మోహన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, పరిగి రామ్మోహన్‌ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్‌, బాలునాయక్‌, రామచంద్రనాయక్‌ మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఇక ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, కోదండరాంలలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్సు ఉంది.

Eha Tv

Eha Tv

Next Story