ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వక్ఫ్ సవరణ బిల్లు 2025కు విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వక్ఫ్ సవరణ బిల్లు 2025కు విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నీతీష్ కుమార్‌లు ఎన్డీఏ మిత్రపక్షాలుగా బీజేపీ(BJP)కి మద్దతు ఇవ్వడంపై మమతా తీవ్రంగా స్పందించారు. కోల్‌కతాలో ముస్లిం మత నాయకులతో జరిగిన సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు(Chandrababu naidu), నీతీష్ కుమార్‌లు వక్ఫ్ బిల్లుపై మౌనం వహించారని, కేవలం అధికారం కోసం బీజేపీకి మద్దతు ఇచ్చారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన వారు అధికారం కోసం మనసు చంపుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
వక్ఫ్ సవరణ బిల్లును బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదింపజేసింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (tdp), నీతీష్ కుమార్ జేడీ( nithish kumar JD) ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. మమతా ఈ బిల్లును వ్యతిరేకించారు. మూడో వంతు మెజారిటీతో ఆమోదించాల్సి ఉందని, కానీ అలా జరగలేదని విమర్శించారు.ఈ బిల్లు వల్ల ముస్లిం సమాజంలో అసంతృప్తి ఉందని, దీనిపై చంద్రబాబు, నీతీష్ వంటి ఎన్డీఏ మిత్రపక్ష నాయకులు గళం విప్పకపోవడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఆమె బెంగాల్‌లో ఈ బిల్లును అమలు చేయనివ్వనని కూడా ప్రకటించారు.
మమతా వ్యాఖ్యలపై ఎన్డీఏ (NDA)మిత్రపక్షాల నాయకులు తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ రాజీవ్ రంజన్ ప్రసాద్ ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. బెంగాల్‌ను బంగ్లాదేశ్‌లా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. నీతీష్ కుమార్‌కు మమతా సలహాలు అవసరం లేదని రంజన్ ప్రసాద్(Ranjan Prasad) అన్నారు. ఇదిలా ఉంటే 2023లో చంద్రబాబు నాయుడు అరెస్టయినప్పుడు మమతా బెనర్జీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో ఆమె చంద్రబాబు అరెస్టును కక్ష సాధింపు చర్య అని విమర్శించారు.
